NewsOrbit
న్యూస్ సినిమా

Samantha: మొహమాటం పక్కన పెట్టి ఓపెన్ అయిపోయిన సమంత.. ఒకే ఒక్క మాటతో ఎవరికి తగలాలో వాళ్ళకి చెప్పేసింది!

Advertisements
Share

Samantha: సమంత.. కొన్ని వారాలుగా సోషల్ మీడియాలో నానుతున్న పేరు. అవును.. తెలుగు చిత్రసీమలో ఎదురులేని తారగా వెలుగొందింది సమంత. మొదటి సినిమా ‘ఏమాయ చేసావే’తో తెలుగు యువత మనసుల్ని మాయ చేసింది. అక్కడినుండి సామ్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. నిర్మాతల పాలిట దేవతయ్యింది. లక్కీ లేడీగా ఇక్కడ ప్రసిద్ధి గాంచింది. దాదాపు అందరి టాప్ హీరోలతోనూ సామ్ నటించింది. కాదు కాదు.. ఏరి కోరి వారు సామ్ ను కోరుకునేవారు.

Advertisements

Samantha: వివాహం నుండి విడాకుల వరకు..

Samantha

సామ్ ‘ఏమాయ చేసావే’ సినిమాతో తెలుగు ప్రజలనే కాదు, అందులో నటించిన నాగ చైతన్యను కూడా మాయలో పడేసింది. ఇంకేముంది కట్ చేస్తే.. 7 October 2017న అంగరంగ వైభవంగా చే-సామ్ ల వివాహం జరిగింది. అక్కడినుండి మొన్నటివరకు వారు ఆదర్శ దంపతులుగా పేరుగాంచారు. ఇంతలో ఏమైందో గాని రీసెంటుగా వారు వారి వివాహ బంధానికి స్వస్తి చెబుతూ విడాకులు తీసుకున్నారు. విషయమేదైనా ఇది వారి ఇద్దరికి సంబంధించిన విషయం. కానీ సోషల్ మీడియాలో కేవలం సమంతపైనే ట్రోల్స్ రావడం బాధాకరం.

Advertisements

 

సమంత తాజా వేడివేడి సమాచారం ఇదే..

 

సామ్ ఇటీవల మానసిక ఆరోగ్యానికి సంబంధించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో అక్కడి విలేఖరులు అడిగిన ప్రశ్నలకు బదులుగా.. “సమస్యలు అందరికీ ఉంటాయి. నేను కూడా మానసికంగా ఎన్నో ఎదుర్కొన్నాను. కానీ వాటి నుంచి అతిత్వరగా బయటపడగలిగాను. ఈ విషయంలో కొందరి శ్రేయోభిలాషుల సహాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను.” అని అన్నారు. ఆమె ఇంకా మాట్లాడుతూ.. “మనం చాలా భయంకర ప్రపంచంలో జీవిస్తున్నాం. సోషల్‌ మీడియా ఫోకస్‌ ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. పర్‌ఫెక్ట్‌గా జీవించడం ఈ రోజుల్లో కష్టమైన పని. నన్ను నమ్మండి. ఎవరి జీవితమూ అంత పర్‌ఫెక్ట్‌గా లేదు.” అని సో కాల్డ్ వర్గానికి చెప్పకనే చెప్పింది.

Samantha: షన్ను-దీప్తి సునైనాల బ్రేకప్ మీద సమంత స్పందన?

Share
Advertisements

Related posts

Pushpa 2: “పుష్ప” సెకండ్ పార్ట్ కోసం ఇబ్బంది పడుతున్న సుకుమార్..!!

sekhar

Nagababu : బాబోయ్.. నాగబాబు ఇంట్లో పాములు.. ఎలా వచ్చాయో ఈ వీడియోలో చూడండి?

Varun G

Tharman: సినీ ఇండస్ట్రీలో కలవరాన్ని రేపుతున్న కరోనా..! తాజాగా టాప్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌కి..!!

somaraju sharma