Samantha: నాగచైతన్య నుంచి విడిపోయిన తరువాత సమంత తీవ్ర మానసిక వేదనతో సతమతమవుతున్నారని తెలుస్తోంది. అందుకే తన వద్దకు వచ్చిన ప్రతీ సినిమాలకు ఓకే చెప్పేస్తూ బిజీ అయిపోవడానికి రెడీ అయిపోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే తమిళ్ ఖైదీ చిత్ర నిర్మాతలతో ఒక సినిమా, ఒక తెలుగు ప్రొడ్యూసర్ తో మరొక సినిమా ప్రకటించారు. ఈ రెండు సినిమాలు కూడా తమిళ దర్శకులే తెరకెక్కించడం గమనార్హం. ఆమె తెలుగు డైరెక్టర్లను ఎందుకు ఎంచుకోలేదనేది ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. నిజానికి కొందరు తెలుగు టాప్ డైరెక్టర్లు ఆమెతో సినిమాలు తీసేందుకు సుముఖత చూపడం లేదట. దీనికి కారణం నాగచైతన్యతో ఆమె విడాకులు తీసుకోవడమేనని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇదిలా ఉండగా ఆమెకు విడాకులకు ముందు కళ్ళు చెదిరే సువర్ణావకాశాలు అవకాశాలు వచ్చాయని.. కానీ అవన్నీ నాగచైతన్య కోసమే వదులుకున్నారనే నిజాలు బయట పడుతున్నాయి.
Samantha: సమంత ఎమోషనల్ కామెంట్లు.. వింటేనే కన్నీళ్లు రావాల్సిందే.. !
బాలీవుడ్ నుంచి బంపరాఫర్
దక్షిణాది అగ్రతార సమంత ఫ్యామిలీ మ్యాన్ 2 సీజన్‌తో ఉత్తరాది ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. జూన్ నెలలో విడుదలైన ఈ అమెజాన్ వెబ్ సిరీస్ తో ఆమె క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఈ క్రమంలోనే ఆమె కాళ్ల ముందుకు బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్‌తో కలిసి నటించే సువర్ణవకాశం వచ్చింది. తమిళ దర్శకుడు అట్లీ షారుఖ్‌ఖాన్‌తో భారీ బడ్జెట్ సినిమా ప్లాన్ చేసి.. అందులో హీరోయిన్గా సమంతను తీసుకోవాలని భావించారట. షారుక్ ఖాన్‌తో సినిమా అంటే ఎవరైనా.. సరే, ఎగిరి గంతేసి ఒప్పుకుంటారనే భావనతో అట్లీ ఈ ముద్దుగుమ్మను సంప్రదించారు. కానీ ఆమె మాత్రం.. తాను తన కుటుంబ జీవితంపై శ్రద్ధ పెట్టాలని భావిస్తున్నానని.. అంతేకాకుండా పిల్లల్ని కూడా ప్లాన్ చేశానని అట్లీకి చాలా సున్నితంగా చెప్పారు. ఈ కారణాల వల్ల తాను షారుక్ ఖాన్ తో కాదు కదా ఎవరితోనూ నటించే పరిస్థితి లేదని విస్పష్టం చేశారట. దాంతో షాకయిన అట్లీ ఆ గోల్డెన్ ఛాన్స్ ను నయనతారకు ఇచ్చేశారు.
Samantha: నా అఫైర్స్ గురించి మాట్లాడడానికి మీరు ఎవరు రా.. సమంత పైర్…!
త్యాగాలు చేసిన విడాకులు మాత్రం జరగక తప్పలేదు
సమంత నాగచైతన్యతో తన వివాహబంధాన్ని కాపాడుకోవడానికి విశ్వప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. అందుకే చాలా ఆఫర్లు రిజెక్ట్ చేసి.. కేవలం లేడి ఓరియెంటెడ్ చిత్రాలకే పరిమితమైనట్లు కూడా సమాచారం. కానీ ఎక్కడ తేడా వచ్చిందో తెలియదు గానీ వీరు ఇద్దరు మాత్రం విడిపోవాల్సి వచ్చింది.
Samantha: విడాకుల విషయంలో సమంతాకి సపోర్ట్ గా నిలిచిన బిగ్ బాస్ బ్యూటీ..!!