న్యూస్ సినిమా

Samantha : అయ్యో పాపం .. సమంత ఇంట్లో దొంగోడు .. కానీ అంతలోనే ట్విస్ట్ !

samantha
Share

Samantha: ప్రముఖ సినీనటి, అందాల తార సమంత రూత్ ప్రభు (Samantha Ruth Prabhu) సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుందన్న విషయం తెలిసిందే. ఈమె తనకు సంబంధించిన అన్ని ఫొటోలు, వీడియోలను సోషల్ మాధ్యమాల్లో షేర్ చేస్తుంటుంది. తాజాగా ఆమె తన ఇంట్లో ఒక దొంగ పడినట్లు.. అతన్ని పోలీసులకు పట్టించినట్లు అభిమానులకు తెలిపింది. అంతేకాదు దొంగ దొంగతనం చేస్తున్నప్పుడు రికార్డైన దృశ్యాలను ఇన్‌స్టాగ్రామ్ (Instagram)లో ఒక వీడియో రూపంలో షేర్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. ఇప్పటికే ఈ వీడియోకి 5 లక్షల పైగా లైక్స్ వచ్చాయి. సోషల్ మీడియాను కుదిపేస్తున్న ఈ వైరల్ వీడియోలో ఏముంది? అందులో ఎలాంటి అదిరిపోయే ట్విస్ట్ ఉంది? తెలుసుకుందాం.

Samantha : అయ్యో పాపం .. సమంత ఇంట్లో దొంగోడు

samantha

సమంత (samantha) ఇంట్లో దొంగతనం అందరికీ తెలిసే జరిగింది. ఓ అర్ధరాత్రి దొంగోడు ఆమె ఇంట్లోకి ప్రవేశించగా.. అతన్ని సమంత కుటుంబ సభ్యులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అంతే కాదు సమంత అతడికి తినడానికి ఒక స్నాక్స్ ప్యాకెట్ కూడా ఇచ్చింది.

కానీ అంతలోనే ట్విస్ట్ !

samantha
samantha

స్నాక్స్ ప్యాకెట్ ఇవ్వడం ఏంటని ఆశ్చర్యపోకండి.. ఎందుకంటే నిజానికి ఈ దొంగతనం ఒక కుర్‌కురే యాడ్‌లో భాగంగా జరిగింది. ఇదంతా నటనే కాగా ఇందులో సమంత, బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌(Akshay Kumar) నటించారు. కుర్‌కురే స్నాక్స్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న అక్షయ్ కుమార్.. సమంత ఇంట్లో కుర్‌కురే ప్యాకెట్ దొంగతనం చేసినట్టు నటించారు. ఇందులో అర్ధరాత్రి అక్షయ్ కుమార్ సమంత ఇంట్లో దొంగతనానికి వస్తాడు. అప్పుడు అతనికి కుర్‌కురే ప్యాకెట్ కనిపిస్తుంది. అది తీసుకోబోతుండగా వెంటనే సమంత అతన్ని పట్టుకుంటుంది. అతని ముందే స్నాక్స్‌ ప్యాకెట్ తీసుకొని తింటుంది. అలాగే అక్షయ్ కుమార్ కి స్నాక్స్ కూడా ఇస్తుంది. ఆ స్నాక్ ప్యాకెట్ అయిపోగానే.. అక్షయ్ కుమార్ ఇక సెలవు అని చెప్పి వెళ్తుండగా.. ‘ఆగు బాబు నీ కోసం బండి కూడా వస్తుంద’ని సమంత అంటుంది. బండి కూడా ఇస్తారా?? అని సంతోషపడే లోపు పోలీస్ సరైన్ మోగడంతో అక్షయ్ ఖంగు తింటాడు. ఇలాంటి ప్రకటనను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసి.. “సినిమాల్లో పోలీస్ ఆఫీసర్ గా కనిపించే అక్షయ్ కుమార్ కుర్‌కురే దొంగగా మారిపోయాడు.. ఇదేం ప్రవర్తన అక్షయ్? ” అని సామ్ ఒక క్యాప్షన్ జోడించింది.

Samantha: ;అతని వల్ల కాలేదు .. ఓడిపోయాడు.. వీడియో లో లైవ్ లో చెప్పేసిన సమంత

Share

Related posts

Prabhas Maruthi: ప్రభాస్ కంటే ముందే మరో ప్రాజెక్టు స్టార్ట్ చేయనున్న మారుతి..??

sekhar

15,000 కోట్ల ఆదాయం క‌రోనా టైంలో కేసీఆర్ పెద్ద ప్లాన్‌…రంగంలోకి ఇంటెలిజెన్స్‌?

sridhar

స్కూల్‌ను ద‌త్త‌త తీసుకున్న సాయితేజ్‌

Siva Prasad