Samantha: పబ్ లో రచ్చ చేస్తున్న సమంత …!

Share

Samantha: ప్రస్తుతం సోషల్ మీడియాలో సమంత ఫోటోలు బాగా ట్రెండింగ్ గా మారాయి. తాజగా.. సమంత, నయనతార, విజయ్ సేతుపతి నటించిన కాథు వాక్కుల రెండు కాదల్ అనే సినిమాకు సంబంధించిన ఒక సరికొత్త అప్డేట్ వచ్చింది. అది ఏంటంటే.. ఈ చిత్రం నుంచి మెయిన్ కాస్ట్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లను చిత్ర యూనిట్ రిలీజ్ చేసారు.ఈ సినిమాలో సమంత(Samantha) కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తుంది. ఈ సినిమాలో సామ్ పాత్ర ఎలా ఉంటుందో అని అందరిలోనూ ఆసక్తి మొదలయింది.

Samantha: పూజా హెగ్డే, రష్మిక మందన్నలను టార్గెట్ చేసిన సమంత..?
ఖతిజా పాత్రలో సామ్ ఇలా ఉందేంటి :

ఈ సినిమాలో సమంత ఖతిజా అనే పాత్రలో నటిస్తుంది. రిలీజ్ చేసిన పోస్టర్ లో సమంతను చూస్తే చాలా సింపుల్‌గా కనిపిస్తుంది. సామ్ పాత్ర ఏంటి అంత సింపుల్ గా ఉందని నెటిజన్లు అందరు ఈ పోస్టర్‌ ను చూసి షాక్ అవుతున్నారు. గతంలో ఈ సినిమాకు సంబందించి రిలీజ్( realse) చేసిన పాట, పోస్టర్లు,లీకైన వీడియోలు చూస్తే సమంత, నయనతార ఇద్దరూ కూడా ఎంతో సంప్రదాయంగా చీరలు కట్టుకుని, పూలు పెట్టుకుని సాధారణ మధ్య తరగతి అమ్మాయిలుగా కనిపించారు. కానీ ఇప్పుడు రిలీజ్ చేసిన పోస్టర్స్ చూస్తుంటే సమంత అల్ట్రా మోడ్రన్‌ లుక్ లో కనిపిస్తోంది.


Samantha: ఇండస్ట్రీలో చాలామంది సమంతవైపే ఉన్నారు..అందుకు కారణాలు ఇవే..!
పబ్ లో సామ్ ఉండడం వెనుక కారణం ఇదేనా :

ఈ పోస్టర్ లో సమంత పబ్బులో ఉండటం మనం చూడవచ్చు. రింగులు తిరిగిన జుట్టుతో, నోట్లో వేలుపెట్టుకుని, స్టైలిష్ డ్రెస్ తో ఏదో దీర్ఘాలోచనలో ఉన్నట్టు పోస్టర్‌ లో కనిపిస్తుంది. కాగా మొదట చీరలో కనబడ్డ సామ్ మరి ఇప్పుడు ఎలా పబ్ లో ఏదో ఆలోచనలో పడిందని అనుమానం అందరిలో వస్తుంది. ఒకవేళ ఈ సినిమాలో సమంతకు సంబంధించి ఏమైనా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఉన్నాయా…? అందుకే సమంత అలా కనిపిస్తుందా..? అనే ప్రశ్నలు నెటిజన్లను వేధిస్తున్నాయి. ఏది ఎలా ఉన్న విజయ్ సేతుపతి, సమంత ఫస్ట్ లుక్ (frist look)పోస్టర్లకు ఒక రేంజ్ లో పాపులారిటీ వచ్చిందనే చెప్పాలి. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సంవత్సరం చివరిలో అంటే డిసెంబర్‌ నెలలో ఈ సినిమా విడుదల కానుందని చిత్ర యూనిట్ ప్రకటించారు.


Share

Related posts

Sakshi Agarwal Cute Looks

Gallery Desk

ట్రిపుల్ తలాక్ చట్టం కేసు నమోదు

somaraju sharma

Tarun: ఎన్నో సినిమాలు చేస్తూ ఇప్పుడు స్టార్‌గా ఇండస్ట్రీలో వెలగాల్సిన తరుణ్ అందుకే అవకాశాలు దక్కించుకోలేపోతున్నాడా..?

GRK