Samantha: నాగ చైతన్య విడాకుల అనంతరం సమంత మరింత స్పీడు పెంచింది. ఈ క్రమంలో వరుస చిత్రాలకు సైన్ చేసుకుంటూ పోతుంది. సౌత్ లో మాత్రమే కాకుండా బాలీవుడ్ లో కూడా అమ్మడుకి అవకాశాలు మెండుగా వస్తున్నాయి. అలాగే తమిళంలో కూడా సామ్ కి అవకాశాలు వస్తున్నాయి. విజయ్ సేతుపతి సరసన ‘కణ్మణి రాంబో ఖతీజా’ అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ లో సామ్ నటిస్తున్న సంగతి విదితమే. వెరైటీగా వున్న ఈ టైటిల్ తో తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా ఓ మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో నయనతార కూడా మరో హీరోయిన్ గా నటించడం విశేషం.
Samantha: ఇంస్టాగ్రామ్ లో సమంత ఒక పోస్ట్ కి ఎంత తీసుకుంటుందో తెలుసా..??
Samantha: ఆ సప్రైజ్ ఇదే…!
ఇకపోతే నయనతార ముద్దుల ప్రియుడు ‘విగ్నేష్ శివన్’ ఈ చిత్రానికి దర్శకుడు. అందుకేనేమో ఈ మూవీకి నయనతార కూడా నిర్మాణ బాధ్యతల్లో పాలుపంచుకున్నారు. ఈ చిత్రంలో నటించడం వల్ల సమంత, నయన్ మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. కాగా, ఈ చిత్ర సెట్స్ లో నయనతార బర్త్ డే ని సమంత సెలెబ్రేట్ చేసింది. అంతలా వీరిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ ఐపోయారన్నమాట. తాజాగా నయనతార సమంతకు ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చింది. ఇక ఆ గిఫ్ట్ చుస్తే మీకు రెండు కళ్ళు సరిపోవు. వాటిని చూసి అమ్మడు తెగ మురిసిపోతుంది.
Samantha: పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ సినిమా ఇది: సమంత
వైరల్ అవుతున్న గిఫ్ట్:
ఇంతకీ అవేమాటనేగా మీ అనుమానం. అక్కడికే వస్తున్నా… కాస్ట్లీ ఇయర్ రింగ్స్ ని సమంతకు నయనతార గిఫ్ట్ గా ఇచ్చి సర్ప్రైజ్ చేసింది. అంతేకాకుండా ‘డియర్ ఖతీజా.. విత్ లవ్.. కణ్మణి’ అంటూ ఈ చిత్రంలోని తమ క్యారెక్టర్స్ పేర్లు వచ్చేలా ఓ లెటర్ కూడా పంపడం విశేషం. నయన్ ఇచ్చిన గిఫ్ట్ ని సమంత సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, ‘థ్యాంక్యూ నయన్’ అని సమంత కామెంట్ పెట్టింది. ప్రస్తుతం ఆ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక సమంత ‘కణ్మణి రాంబో ఖతీజా’ తో పాటు శాకుంతలం, యశోద లాంటి పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసినదే కదా.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?