Samantha: మల్టీస్టారర్ మూవీలో జాయిన్ అయిన సమంత..ఈ సినిమాకి బల్క్ డేట్స్..

Share

Samantha: సమంత అక్కినేని మళ్ళీ స్పీడ్ పెంచారు. మజిలీ, ఓ బేబీ లాంటి సూపర్ హిట్స్ తర్వాత జానుతో డిజాస్టర్ అందుకుంది. దాంతో కొంత గ్యాప్ తీసుకున్న ఆమె క్రేజీ వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2లో రాజీ అనే తీవ్రవాది పాత్రలో నటించింది. ఈ పాత్ర సమంతకి చాలా మంచి పేరు తెచ్చుకుంది. తెలుగు, తమిళ బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించి సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగుతున్న సమంత ఎందుకు హిందీ సినిమాలలో నటించడం లేదనే కామెంట్స్ బాగా వినిపించాయి. అయితే అంతకముందు సమంత హిందీ సినిమాల మీద అంతగా ఆసక్తి లేదని చెప్పింది.

samantha-joined in multi starer movie
samantha-joined in multi starer movie

కానీ తెలుగు వారైన రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్‌తో దేశ వ్యాప్తంగా భారీ స్థాయిలో క్రేజ్ తెచ్చుకోవడంతో వారితో అటు ప్రాజెక్ట్ చేయాలని బాలీవుడ్ ఇటు టాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్స్ ఎంతో తాపత్రయపడుతున్నారు. ఆ క్రమంలోనే సమంత కూడా వారి దర్శకత్వంలో ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ లో నటించి ఒక్కసారిగా బాలీవుడ్‌లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ క్రమంలో అన్నీ క్రేజీ ప్రాజెక్ట్స్‌కి సైన్ చేస్తోంది. ఇటీవలే పాన్ ఇండియా సినిమా శాకుంతలం సినిమాలో నటించింది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసిన సమంత ఇక ఇప్పట్లో మళ్ళీ కొత్త సినిమా షూటింగ్‌లో జాయిన్ కాదని అనుకున్నారు.

Samantha: సమంత – నయనతార – విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో పాన్ ఇండియన్ సినిమా

కానీ ఆమె ఇంతకముందే కమిటయిన ఓ మల్టీస్టారర్ సినిమాలో జాయిన్ అయ్యారు. నయనతార – విజయ్ సేతుపతి – సమంత ప్రధాన పాత్రల్లో పాన్ ఇండియన్ స్థాయిలో మల్టీస్టారర్ రూపొందుతోంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీతో మల్టీ స్టారర్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ మొదలై కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆగిపోయింది. ఇటీవలే మళ్ళీ మొదలవగా ప్రధాన తారాగణం పాల్గొంటున్నారు. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో “కాతు వాకుల రెండు కాదల్” అనే టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ ప్రాజెక్ట్‌కి కూడా సమంత బల్క్ డేట్స్ ఇచ్చిందట. ఈ ఏడాదిలోనే ఈ ప్రాజెక్ట్‌ను కూడా కంప్లీట్ చేయనుందట.


Share

Related posts

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు ఎంపికయ్యే అవకాశం?

Vihari

ముంబై డ్యాన్స్ బార్లకు ఊరట

Siva Prasad

Krithi Shetty New Pictures

Gallery Desk