Samantha: ప్రస్తుతం టాలీవుడ్లో సమంత హవా నడుస్తోందనే చెప్పుకోవాలి. ప్రస్తుతం ఆమె యశోద సినిమా షూటింగ్లో బిజీగా వుంది. ఈ క్రమంలోనే కొన్ని సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇక అసలు విషయంలోకి వెళితే, సమంత – చైతన్య విడాకుల వివాదంలో ‘ప్రీతమ్ జుకల్కర్’ పేరు ఆ మధ్య బాగా వినబడింది. ఆ సమయంలో సమంత, ప్రీతమ్ మధ్య ఎలాంటి రూమర్లు వచ్చాయో అందరికీ తెలిసిందే. ప్రీతమ్ వల్లే సమంత చైతన్యలు విడిపోయారంటూ కూడా రూమర్లు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.
Samantha: డబ్బులు ఇవ్వంది తానేనట?
అసలు విషయంలోకి వెళితే, ప్రీతమ్ ఇప్పుడు సమంతతోనే ఉంటున్నాడు. యశోద సినిమా షూటింగ్ విరామం దొరికినప్పుడు అందరూ కలిసి సరదాగా గడిపినట్టు కనిపిస్తోంది. మామూలుగా అయితే ప్రీతమ్ పని స్టైలిష్ట్. కానీ సమంత ఇప్పుడు హెయిర్ స్టైలిష్ట్‌గా మారింది. ప్రీతమ్ జుట్టును చాలా స్టైల్ గా కట్ చేసింది. అంతటితో ఆగకుండా సదరు ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దాంతో ఆ ఫోటో వైరల్ అయ్యింది.
Samantha: బాలీవుడ్ మూవీ క్రేజీ అప్డేట్స్..నాలుగు నెలల్లోనే రిలీజ్..!
అక్కడితో ఆగలేదు సమంత?
పోస్టులో కాస్త టెక్స్ట్ కూడా రాసింది.. “నాకు చాలా పనులు వచ్చు.. నేను మల్టీటాలెంటెడ్!” అని తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. ఇందులో ప్రీతమ్ జుట్టును కట్ చేసిన దృశ్యాలు కనిపించాయి. ఇక దాంతో పాటు ప్రీతమ్ మీద సమంత ఫన్నీగా స్పందించింది. తనకి చేసిన హెయిర్ కటింగ్ కి గాను అతగాడు ఇంకా డబ్బులు చెల్లించలేదు అని బుంగమూతి పెట్టిన ఎమోజీని సమంత షేర్ చేయడం కొసమెరుపు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?