Samantha: చీర కట్టులో, చుడీదార్లలో ఏం మాయ చేశావే సినిమాలో ఎంతో అందంగా కనిపించింది సమంత. అందచందాలతో పాటు తనదైన హావభావాలతో ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించుకుంది. నాగచైతన్యను ప్రేమించి, పెళ్లి చేసుకుని అక్కినేని వారి ఫ్యామిలీలో అడుగు పెట్టింది. పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తూ వచ్చింది. అయితే గతేడాది హఠాత్తుగా విడాకుల నిర్ణయాన్ని ప్రకటించి, ఇద్దరూ షాకిచ్చారు. ఆ తర్వాత ఎవరికి వారే అన్నట్లు చై, శామ్ జీవిస్తున్నారు. వరుసగా సినిమాలు చేస్తూ బిజీ అయిపోయారు. ఇక పుష్పలో ఐటమ్ సాంగ్‌తో మెరిసిన సమంత వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. ఎంతో హోమ్లీగా కనిపించే ఆమె ఓ ఫంక్షన్లో తన అందాలను ప్రదర్శించేలా డ్రెస్ వేయడం చూసి అంతా అవాక్కయ్యారు.
Samantha: సమంత దూకుడు మామ్మూలుగా లేదు.. యావత్ సౌత్‌లోనే టాప్ రెమ్యునరేషన్ తోసుకుంటోంది!
Samantha: వేడుకలో అందరి చూపు ఆమె వైపే..
ఫ్యామిలీ మేన్ -2 తర్వాత సమంత క్రేజ్ బాలీవుడ్‌కు పాకింది. సౌత్ సినిమా ఇండస్ట్రీలతో పాటు బాలీవుడ్‌లోనూ పాగా వేసేందుకు ఎదురు చూస్తోంది. దేశవ్యాప్తంగా ఆమెకు అభిమానులు విపరీతంగా ఉన్నారు. ఈ క్రమంలో ఓ సినిమా అవార్డుల ఫంక్షన్లో తళుక్కున మెరిసింది సమంత. ఎప్పుడూ మోడరన్‌గా ఉండే సమంత ఈ సారి మరింత హాట్‌గా కనిపించింది. డిజైనర్ డ్రెస్‌లో దేవకన్యలా మెరిసిపోతున్న ఆమెను వేడుకలో అతిథులంతా చూస్తూ ఉండిపోయారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Samantha: అదేంటి పెళ్ళిచీరను సమంత వారికి తిరిగి ఇచ్చేసిందా?
సినీ కెరీర్‌పై మరింత ఫోకస్
నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత సినిమాలపై దృష్టి సారించింది. వరుస సినిమాలు చేస్తూ తీరిక లేకుండా గడుపుతోంది. గుణశేఖర్ దర్శకత్వంలో వస్తున్న శాకుంతలం, తమిళంలో విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో కాతు వాకల రెండు కాదల్, హరి శంకర్ దర్శకత్వంలో యశోద చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి. ఇవన్నీ 2022లోనే విడుదల కానున్నాయి. అంతేకాకుండా మరిన్ని సినిమాలకు ఆమె సైన్ చేసినట్లు తెలుస్తోంది. విడాకుల ప్రభావం తన కెరీర్‌పై పడకుండా వరుస సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తోంది.