Samantha: టాలీవుడ్ లక్కీ లేడి సమంత గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి సినిమా ‘ఏ మాయ చేసావే’తోనే తెలుగు ప్రేక్షకులను మాయలో పడేసిన మాయలేడి సమంత. అక్కడితో ఆగకుండా అందులో నటించిన హీరో, అక్కినేని వారసుడు నాగ చైతన్యను కూడా పడేసి ఏకంగా పెళ్లి కూడా చేసేసుకుంది. అయితే ఏమయిందో తెలియదు కానీ వారు అనతికాలంలోనే వారి వ్యక్తిగత జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టేసారు. విడాకుల అనంతరం కూడా అమ్మడు జోరు తగ్గడం లేదు. ఓ రకంగా చెప్పాలంటే ఇప్పుడే సమంత సినిమా లైఫ్ జెట్ స్పీడుతో దూసుకుపోతోంది.
Samantha: ఆ పోస్ట్ వైరల్
ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ హిట్‌తో ఒక్కసారిగా అమ్మడు హిందీలో కూడా మంచి పాపులర్ అయింది. ఈ సిరీస్ తర్వాత వరుసగా పాన్ ఇండియా స్థాయి సినిమా అవకాశాలను అందుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో ఇటు టాలీవుడ్‌తో పాటు అటు కోలీవుడ్, బాలీవుడ్ అని తేడాలేకుండా సమంత వరుసగా సినిమాలు చేస్తూ పోతోంది. అయితే గత కొన్నిరోజులుగా సమంత.. సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టు పెట్టలేదు. ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లో యాక్టివిటీ తగ్గించేసింది. అయితే తాజాగా సమంత పెట్టిన పోస్టు ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
గుర్తు పట్టలేని విధంగా సమంత
విషయం ఏమంటే, లేటెస్ట్ ఫోటోలను చూసి అభిమానులు ఒకింత షాకవుతున్నారు. దానికి కారణం, అభిమానులు గుర్తు పట్టలేని విధంగా సమంత ఈ ఫోటోలలో కనిపించడమే. లేటెస్ట్ పిక్స్ చూస్తే.. అందులో సమంత ముఖం కొత్తగా కనిపిస్తుంది. దీంతో సమంత లేటెస్ట్ పిక్స్ పై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. సమంత ముఖంలో అంతకుముందు ఉన్న కళ ఏ మాత్రం లేదని కామెంట్లు చేస్తున్నారు. సమంత సర్జరీ చేయించుకున్నారని సర్జరీ వల్ల సమంత గుర్తు పట్టలేని విధంగా మారిపోయారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.