Samantha- Naga Chaitanya: సమంతాతో విడాకులు అని ప్రకటించిన 24 గంటల తరువాత నాగచైతన్య ఆసక్తికర నిర్ణయం..!?

Share

Samantha- Naga Chaitanya: సమంత, నాగచైతన్య 2010 నుంచి డేటింగ్ చేసుకోవడం ప్రారంభించారు. చైతూ సినిమాల్లోనే కాదు నిజజీవితంలో కూడా సిన్సియర్ లవర్ కావడంతో కుటుంబ సభ్యులకు ఇష్టం ఉన్నా.. లేకపోయినా సరే సమంతను పెళ్ళాడారు. వీరు 2017లో హిందూ, క్రైస్తవ మతాల సంప్రదాయాల్లో బ్రహ్మాండంగా పెళ్లి చేసుకున్నారు. అయితే పట్టుమని పదేళ్లు కూడా కలిసి ఉండకుండానే వీరు విడిపోవడం బాధాకరమైన విషయమే. జులై 2021 నుంచీ వీరిద్దరూ వేర్వేరుగా ఉంటున్నట్టు అనుమానాలు వచ్చాయి. దీనికి కారణం సమంత తన అత్తింటివారి “అక్కినేని” అనే ఇంటి పేరును తన సోషల్ మీడియా ఖాతాలను నుంచి తొలగించడమే. అప్పటి నుంచి మొదలైన రూమర్లు మొన్నటి వరకు విపరీతంగా హల్చల్ చేశాయి. ఈ నేపథ్యంలోనే ఇరువురు తమ వైవాహిక బంధానికి ముగింపు కార్డు వేశారు.

Samantha: నిన్న విడాకులు అంది.. ఇవాళ సినిమాకి సంతకం పెట్టింది…!

Samantha- Naga Chaitanya: విడాకులపై నాగచైతన్య

నాగచైతన్య తన విడాకుల ప్రకటనను చాలా హుందాగా విడుదల చేశారు. ఎటువంటి నెగిటివిటీకి తావివ్వకుండా చక్కగా వ్యవహరించిన ఆయన తీరు చాలా మందికి నచ్చుతోంది. తమకు ఇష్టమైన మార్గాల్లో కొనసాగేందుకు విడిపోవడమే పరిష్కారం అంటూ అతను వెల్లడించారు. అయితే పదేళ్ల ప్రణయబంధానికి అనూహ్యంగా ఎండ్ కార్డు వేయడం వెనుక ఏదో ఒక బలమైన కారణమే ఉంటుందని చాలా మంది భావిస్తున్నారు. ముఖ్యంగా జర్నలిస్టులు, ప్రముఖ న్యూస్ మీడియా ఛానళ్లు ఈ జంట విడిపోవడానికి గల కారణం ఏంటనే విషయాన్ని ఆరా తీయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

Samantha: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమంత స్టేటస్..!!

విడాకుల తర్వాత చైతు తీసుకున్న ఆసక్తికర నిర్ణయం

ఇందులో భాగంగా ప్రస్తుతం నాగచైతన్యను కాంటాక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. విడాకుల వ్యవహారంలో పూర్తి క్లారిటీ ఇవ్వాలని మీడియా వారు విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ నాగచైతన్య మాత్రం తన విడాకుల గురించి కొన్నాళ్ల వరకు ఎవరితో మాట్లాడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారని సన్నిహితులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత జీవితాలకు ప్రైవసీ ఇవ్వాలని చైతూ కోరుతున్నారు. అందుకే అతను ప్రతి ఇంటర్వ్యూను సైతం రిజెక్ట్ చేస్తున్నారు. విడాకుల గురించి పూర్తిగా మర్చిపోయి జీవితంలో ముందుకు సాగాలనే ఆలోచనలో నాగచైతన్య ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే తాను ఈ విషయంలో ఏమీ మాట్లాడ దలుచుకోలేదు అన్నట్లు స్పందిస్తున్నారు. నాల్రోజులయితే తమ విడాకుల గురించి అందరూ మర్చిపోతారని.. పరిస్థితులు చక్కబడతాయని చైతు మౌనాన్ని పాటిస్తున్నారని తెలుస్తోంది.

Akkineni Nagarjuna: చై .. సామ్ విడాకులపై భావోద్వేగంతో స్పందించిన నాగ్


Share

Related posts

మాజీ భ‌ర్త పెళ్లిపై అమ‌లాపాల్ కామెంట్‌

Siva Prasad

అందుకే రాజధాని మార్చేస్తున్నారు… అసలు స్టోరీ చెప్పిన…!!

sekhar

KGF: ఇండియన్ బాక్స్ ఆఫీస్ షేర్ చేసే కాంబినేషన్ …టాప్ డైరెక్టర్ ని లైన్ లో పెట్టిన “కేజిఎఫ్” హీరో…??

sekhar