Samantha: నిన్న విడాకులు అంది.. ఇవాళ సినిమాకి సంతకం పెట్టింది…!

Share

Samantha:పదేళ్ల ప్రేమాయణానికి, నాలుగేళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతూ అధికారికంగా విడిపోతున్నామని నాగచైతన్య, సమంత ప్రకటించిన సంగతి విధితమే. చాలా రోజులుగా వీళ్లు విడాకులు తీసుకున్నారని ప్రచారం జరిగింది. కానీ అభిమానులు ఎవరూ కూడా వారు నిజంగా విడిపోతారని ఊహించనేలేదు. వారందరికీ తాజా విడాకుల ప్రకటన భారీ షాక్ లా తగిలిందనే చెప్పుకోవాలి. అయితే వారు విడాకులు తీసుకోవడానికి గల కారణం ఏంటో ఇంకా తెలియరాలేదు. అక్కినేని కుటుంబంలో కోడలిగా వెళ్లడంతో ఆమె స్వేచ్ఛకి బ్రేకులు పడ్డాయని.. అందుకే ఆమె తన బంధాన్ని తెంచుకున్నారని టాక్ నడుస్తోంది. సినిమాలకు దూరమై పక్క హౌస్ వైఫ్, అమల లాగా మారిపోయినట్లయితే ఆమె వైవాహిక బంధం సాఫీగా సాగిపోయేదేమో.

Naga Chaitanya Samantha: సమంతా కి విడాకులు ఇచ్చేసినట్లు క్లారిటీ ఇచ్చేసిన నాగచైతన్య..!!

నటన రంగాన్ని వదులుకోలేక ముగింపు పలికారా..

ఏదైతేనేం.. సమంత నటించకుండా ఉండలేరు. మొన్నీమధ్య దాకా దక్షిణాది అగ్రతారగా వెలుగొందిన సమంత ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ తో నార్త్ ఇండియాలోనూ మంచి గుర్తింపు దక్కించుకున్నారు. ఎన్నో అద్భుతమైన అవకాశాలు వస్తుంటే ఆమెలో నటించాలనే ఆశ కుదురుగా ఉండనివ్వడం లేదు. కానీ అక్కినేని అనే ఇంటి పేరు ఆమె కాళ్ళకు సంకెళ్లయ్యాయి. ఆ సంకెళ్లను తెంచుకుని ధైర్యంగా చైతూతో తెగదెంపులు చేసుకున్నారు. నిన్న విడాకులు అని అలా ప్రకటించి ప్రకటించగానే ఇవ్వాళ ఆమె సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Akkineni Nagarjuna: చై .. సామ్ విడాకులపై భావోద్వేగంతో స్పందించిన నాగ్

ఏ సినిమాకి సైన్ చేశారు..

ఈరోజు సమంత ఒక బాలీవుడ్ సినిమాకి సంతకం చేస్తూ తనకి నటన పట్ల ఉన్న ఆసక్తి ఏంటో చెప్పకనే చెప్పారు. ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ నిర్మించిన రాజ్‌ నిడుమోరు, కృష్ణ డీకే కలసి ఈ బాలీవుడ్ సినిమాని నిర్మించనున్నారు. అయితే ఈ చిత్రం లో ఒక మంచి పాత్ర ఆఫర్ చేయడంతో సమంత వెంటనే ఓకే చెప్పారు. అంతేకాకుండా ఈ చిత్రానికి సంతకం కూడా చేశారు. అయితే నిన్న విడాకులు అన్న సమంత ఈరోజు ఒక సినిమాకి సంతకం చేయడం సినీ వర్గాల్లోనే కాదు అభిమానుల్లో కూడా చర్చనీయాంశంగా మారింది.

Samantha: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమంత స్టేటస్..!!


Share

Related posts

బ్రేకింగ్: శుభవార్త – కరోనా బాధితులకు ఇక్కడ ఉచిత వైద్య సదుపాయం లభించును

Vihari

దేవినేని ఉమా .. గుట్టు మొత్తం రట్టు అయ్యిందిగా !

sridhar

Krishnashtami 2021: కృష్ణాష్టమి రోజున ఇలా పూజిస్తే సరి.. !

Ram