Samantha – Naga Chaitanya: సమంత, నాగచైతన్య గాఢంగా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. నాలుగేళ్ల పాటు కాపురం కూడా చేశారు. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ వాళ్ళిద్దరి బంధం అర్థంతరంగా ముగిసిపోయింది. ఈ బ్రేకప్ తరువాత సమంత ఏ స్థాయిలో కృంగిపోతున్నారో ఆమెకు తప్ప ఇంకెవరికీ తెలియదనే చెప్పాలి. ప్రాణంగా ప్రేమించిన భర్త నుంచి విడిపోతే ఆ బాధ తట్టుకోవడం చాలా కష్టం. సోషల్ మీడియాలో సెలబ్రిటీలను సూటిపోటి మాటలతో కొందరు ట్రోల్స్(trolls) వేధిస్తుంటారు. అలాంటిది ఓ పెద్ద కుటుంబానికి చెందిన హీరో నాగ చైతన్యతో పెళ్లి పెటాకులు చేసుకుంటే ఊరుకుంటారా..? వారు సమంతపై దారుణమైన పోస్టులు, కామెంట్లతో విరుచుకుపడ్డారు.
సమంత ఇబ్బందులు
ఒకపక్క బ్రేకప్ మరోపక్క గాయాన్ని మరింత తీవ్రతరం చేసే మాటలతో సమంత తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు. అయినప్పటికీ, ఆమె డివోర్స్ (Samantha Divorced) తర్వాత ఎదురయ్యే చేదు పర్యవసానాల నుంచి బయటపడేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె ఓ విషయంలో భాగంగా ఇబ్బంది పడుతున్నారు.
సమంత కష్టాలు
భారతదేశ వ్యాప్తంగా గొప్ప నటిగా గుర్తింపు దక్కించుకున్న సమంత తన ఇమేజ్(Samantha Image) ఏమాత్రం పాడు కాకుండా జాగ్రత్త పడేందుకు చాలా ఇబ్బందులు పడుతున్నారు. తానేమీ తప్పు చేయనట్లు.. తన జీవితంలో ఎలాంటి విషాదం జరగనట్లు.. పూర్తిస్థాయిలో సంతోషంగా ఉన్నట్లు.. ఆమె అందరికీ తెలియజేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు బ్రాండ్లతో ఒప్పందాలు, సినిమా ఆఫర్లు ఏ మాత్రం తగ్గకుండా ఉండేందుకు కూడా ఆమె తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బాధలో ఉన్నట్లు తెలిస్తే మధ్యలో ఇబ్బంది పడాల్సి వస్తుందని దర్శకనిర్మాతలు ముఖం చాటేసే ప్రమాదం కూడా ఉంది. దానికి తోడు ఆమె మానసిక ప్రశాంతత కోసం అనేక టూర్లు ప్లాన్ చేస్తూనే సోషల్ మీడియాలో బాగా యాక్టివ్(Samantha Socialism)గా ఉంటున్నారు. దీంతో ఆమెకు గతంలో లాగానే ఆఫర్లు వస్తున్నాయి. వీటిలో తనకు నచ్చిన ఆఫర్స్ ఒప్పుకుంటున్నారామె. ప్రస్తుతం సామ్ దుబాయ్ టూర్(Samantha Dubai Tour)లో ఉన్నారు.