Samantha: టాప్ టు బాటమ్ ‘బ్లాక్’లుక్స్‌తో అదరగొట్టిన సమంత..

Share

Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర కథనాయికగా కొనసాగుతున్న సమంత.. సోషల్ మీడియాలోనూ దుమ్ములేపుతోంది. తన జీవితంలో జరిగే ప్రతీ చిన్న సంఘటనలను ఇన్ స్టా వేదికగా పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతోంది. ఇకపోతే చైతూ నుంచి విడాకులు తీసుకున్న సామ్ చాలా బిజీగా మారిపోయింది. మొదట్లో నెటిజన్ల నుంచి పలు విమర్శకులను ఎదుర్కొన్న సామ్.. ఆ తర్వాత వారి ప్రేమను చూరగొంది. మొన్నటి వరకు తన వ్యక్తి గత సహాయకులతో కలసి తీర్థయాత్రలకు వెళ్లొచ్చిన ఈ చెన్నై బ్యూటీ.. ఇప్పుడు తన కెరీర్ పై సీరియస్‌గా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది.

స్టన్నింగ్ లుక్స్‌తో సామ్..

తాజాగా తన లేటెస్ట్ ఫోటో షూట్‌కు సంబంధించిన పిక్స్‌ను సోషల్ మీడియాలో పోస్టుచేసింది సామ్. టాప్ టు బాటమ్ బ్లాక్ దుస్తుల్లో స్టిన్నింగ్ లుక్స్‌తో మెరిసిపోతోంది సమంత. ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. సామ్‌ను నలుపు రంగు దుస్తుల్లో చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. సొంత బ్రాండ్ ప్రమోషన్‌లో భాగంగా సమంత ఈ ఫోటో షూట్ చేసినట్టు తెలుస్తోంది. #లవ్ లేట్ 20.. #జుకాల్కర్ అనే హ్యాష్ ట్యాగులను సమంత ఈ ఫోటోషూట్‌కు జత చేశారు.

కమింగ్ ప్రాజెక్టులపై ఫోకస్

 

సామ్ విడాకులు తీసుకున్నాక చాలా సినిమాలకు సైన్ చేసింది. అందులో బాలీవుడ్ ప్రాజెక్ట్ కూడా ఒకటి ఉంది. ఇక ప్రస్తుతం నయనతారతో కలిసి తమిళంలో ఓ మూవీ చేస్తున్న సామ్.. సుకుమార్ డైరెక్షన్‌లో అల్లుఅర్జున్ హీరోగా తెరకెక్కుతున్న ‘పుష్ఫ’మూవీలో ఐటం సాంగ్‌కు కూడా ఓకే చెప్పిందట సామ్.. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయని తెలుస్తోంది. సింగిల్‌గా కొత్త జీవితాన్ని ప్రారంభించాలని భావిస్తున్న సమంత.. తన కెరీర్‌ను కూడా ఒక ప్లాన్ ప్రకారం ముందుకు తీసుకెళ్తున్నట్టు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.


Share

Related posts

బ్యాడ్ న్యూస్: ఆ ‘డైరెక్టర్’తో ప్రభాస్ సినిమా క్యాన్సిల్?

Teja

వెంకయ్య రాజకీయం: అమరావతి ఉద్యమంలో రాష్ట్రపతి జోక్యం.. రెండు రోజుల్లో కీలక ప్రకటన?

CMR

బిగ్ బాస్ 4: అయ్యయ్యో ఎంతపని చేశావు గంగవ్వ ..?

GRK