Samantha : పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పుష్ప సినిమాతో పాటు ఈ సినిమాలోని అన్ని పాటలు కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా సమంత నటించిన స్పెషల్ సాంగ్ గురించి అయితే చెప్పే పనే లేదు. ఊ అంటావా మావ.. ఉహు అంటావా.. అంటూ ఒక రేంజ్ లో ఊపు ఊపేసింది. నిజానికి పుష్ప సినిమాకి ఇంత హైప్ రావడానికి గల కారణం ఈ స్పెషల్ సాంగ్ అనే చెప్పాలి. ఎందుకంటే సినిమా రిలీజ్ కు ముందే ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉంటుందని అందులో సమంత నటించనుందని చెప్పడంతో పుష్ప సినిమా మీద ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి.
Samantha : స్పెషల్ సాంగ్ లో సామ్ నటన మాములుగా లేదుగా..?
దానికి తగ్గట్టు సామ్ నటించిన స్పెషల్ సాంగ్ ప్రోమో కూడా రిలీజ్ అవ్వడంతో ఒక్కసారిగా సోషల్ మీడియా మొత్తం షేకయిపోయింది. అన్నిటికి మించి ఈ సినిమా విజయం వెనుక బన్నీ నటన, సుకుమార్ టేకింగ్, రష్మిక గ్లామర్, దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్, చంద్రబోస్ పాటలు, సమంత స్పెషల్ సాంగ్ అన్ని కలిసి పుష్ప సినిమాకు ప్లస్ పాయింట్స్ అయ్యాయి. అందుకే పుష్ప సినిమా మంచి సూపర్ హిట్ అయింది.. ఇంకా ప్రత్యేకంగా పుష్ప సినిమాలోని సామ్ నటించిన స్పెషల్ సాంగ్ గురించి చెప్పాలంటే ఈ పాట వస్తున్నప్పుడు థియేటర్స్ సైతం దద్దరిల్లిపోయాయి. మంగ్లీ సిస్టర్ అయిన ఇంద్రావతి చౌహాన్ కూడా ఈ పాటను మత్తుగా కైపు ఎక్కించే విధంగా పాడి అందరిని ఆకట్టుకుంది. మరోపక్క సమంత డ్యాన్స్ కూడా ఇరగదీసేసింది.
Samantha : స్పెషల్ సాంగ్ కోసం సామ్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుందో తెలుసా..??
నిజానికి సమంత ఈ పాటలో నటిస్తుంది అంటే ఎవరు నమ్మలేదు. అలాగే సమంతను స్పెషల్ సాంగ్ లో నటింపచేయడాని మేకర్స్ చాలా కష్టపడ్డారట. మొదట్లో ఈ సాంగ్ లో నటించేందుకు ఒప్పుకోని సమంత తరువాత అల్లు అర్జున్ తో తనకి ఉన్న స్నేహం కారణంగా ఒప్పుకుందట. హీరో అల్లు అర్జున్ పర్సనల్ గా సమంతను రిక్వెస్ట్ చేసి మరి ఒప్పించాడట. అయితే సమంత ఈ స్పెషల్ సాంగ్ లో నటించడం కోసం భారీగానే రెమ్యునిరేషన్ తీసుకుందట. కేవలం మూడు నిమిషాల పాట కోసం ఆమె ఏకంగా 5 కోట్ల రూపాయలు దాక తీసుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది.
పుష్ప సీక్వెల్ లో మళ్ళీ సమంత నటించనుందా..?!
ఒక్క పాటకు ఇంత రెమ్యునరేషనా అని అందరూ షాక్ అవుతున్నారు. ఇదిలా ఉండగా ఇప్పుడు మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. పుష్ప సినిమాను రెండు పార్ట్స్ గా తెరకేక్కిస్తున్న విషయం తెలిసిందే. పుష్ప ది రైజ్‌కి సీక్వెల్ అయిన పుష్ప ది రూల్ లో కూడా మొదటి సీక్వెల్ మాదిరిగా మరో ‘స్పెషల్’ సాంగ్ ఉంటుందట. ఆ స్పెషల్ సాంగ్ లో కూడా మళ్ళీ సమంతానే తీసుకోవాలని మేకర్స్ చూస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అదే కనుక జరిగితే ఫ్యాన్స్ కు పండగే పండగ అని చెప్పాలి.