Samantha: ప్రస్తుతం సమంత టైం బావుంది. వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకుంటుంది. ఇక ఆ మధ్య వచ్చిన ‘ఊ అంటావా మావ ఊఊ అంటావా మావ’ పాట ఆమె జీవితాన్నే మార్చేసింది. అవును.. బేసిగ్గా ఇలాంటి పాటలకు డాన్స్ చేయాలంటే హీరోయిన్స్ తటపటాయిస్తారు. మొదట్లో సమంతకు కూడా ఇలాంటి ఆలోచనే వచ్చిందట. ఇక ఈ పాట ఎంత పెద్ద హిట్ అయిందో వేరే చెప్పాల్సిన పనిలేదు. సినిమా రిలీజ్ కి ముందే ఆ పాట మాస్ ఆడియన్స్ లోకి వాయి వేగంతో దూసుకుపోయింది.
Samantha: జనాలు అదే గుర్తుపెట్టుకున్నారు.. సమంత ఎమోషనల్ కామెంట్స్!
Samantha: సమంత పెర్పార్మెన్స్!
ఈ పాట సినిమా విడుదలకు ముందు ఎంత హిట్ అయిందో, తరువాత కూడా అంతే హిట్ అయింది. అందులో నటించిన సమంత పెర్పార్మెన్స్ కి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. సమంత హాట్ ఎలివేషన్స్.. ఎక్స్ ప్రెషన్స్ సహా మాస్ లోకి దూసుకుపోయే పదజాలంతో సినిమా సక్సెస్ లో ఆ పాట కీలక పాత్ర పోషించింది. దేవి శ్రీ ప్రసాద్ మార్క్ సంగీతం చాలా గ్యాప్ తరువాత హైలైట్ అయింది. అయితే తాజాగా ఈ పాట గురించి సమంత సంచలన వ్యాఖ్యలు చేసింది.
Samantha: అవార్డుల ఫంక్షన్లో సమంత అందాల ఆరబోత
సమంత ఎక్స్పీరియన్స్ ఇదే…
తాజాగా ఓ మీడియా వేదికగా సమంత సదరు విలేఖరి అడిగిన ప్రశ్నకు బదులుగా.. “ఈ పాటకి తెలుగు ప్రజలు నాపై చూపిస్తున్న ప్రేమని ఎప్పటికీ మర్చిపోలేను. ఇంత పెద్ద హిట్ అవుతుందని కూడా అనుకోలేదు. అంతేకాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలంతా నన్ను గుర్తిస్తున్నారు. ప్రస్తుతం ఊ అంటావామావ పాట గురించే చర్చ నడుస్తోంది. అయితే ఈ పాట ఇంత పెద్ద సక్సెస్ అవుతుందని దర్శకుడు సుకుమార్, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ముందే ఊహించారు. అందుకే ఈ పాటలో నటించే అవకాశం నాకు కల్పించారు అని చెప్పుకొచ్చింది.