Samantha: సమంత క్రేజ్ ఇపుడు అమాంతం పెరిగిపోయింది. ఆమె ఏమి చేసినా టాక్ అఫ్ ది టౌన్ గా మారిపోతుంది. ఇక ఆమె తాజాగా క్రిటిక్ ఛాయిస్ అవార్డు వేడుకల్లో రెడ్ కార్పెట్ పై ఆకుపచ్చ రంగు డిజైనర్ దుస్తుల్లో తళుక్కున మెరిసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ దుస్తులపై ఇటీవల సోషల్ మీడియాలో దుమారం రేగిన సంగతి విదితమే. ఈ క్రమంలో సమంతని తమదైన శైలిలో నెటిజన్లు విమర్శించారు. `ఊ అంటావా మావ ఊఊ అంటావా మావ `పాట తర్వాత సమంత పెద్ద ఎత్తున ట్రోలింగ్ బారిన పడిన సందర్భం ఇదే.
Samantha: సమంతని ప్రొటెక్ట్ చేసిన బాలీవుడ్ బుల్లోడు.. సూపర్ అంటున్న నెటిజన్లు!
Samantha: నెటిజన్లకు సామ్ ఘాటు సమాధానం:
నెటిజన్లపై సామ్ తనదైన శైలిలో విరుచుకుపడింది. ఇన్ స్టా స్టోరీ ద్వారా ఆమె ట్రోలింగ్ పై రియాక్ట్ అయింది. “నేటికీ మహిళలు ధరించే దుస్తుల ఆధారంగా మహిళల ఉద్దేశాల్ని చెబుతున్నారంటే, మీరు ఎదిగిన వైనం కనబడుతోంది. మహిళలు ధరించే దుస్తుల్ని బట్టి వారి ఆలోచన విధానం ఇలాగే ఉంటుందని అంచనా వేయడం మీ నాగరికతను సూచిస్తోంది. ముందు అలాంటి కుంచిత స్వభావాన్ని వీడి బయటకు రండి. హుందాగా..గౌరప్రదంగా మెలగండి. ఈ కామెంట్లు చేసే జనాలు సమజం మంచి కోసం పాటు పడితే బాగుంటుంది.” అని క్లాస్ పీకింది.
Samantha: ఇక సోది కామెంట్లు ఆపండి.. సమంత దిమ్మతిరిగే కౌంటర్!
సామ్ అక్కడితో ఆగలేదు!
“వేసుకున్న దుస్తులను బట్టి క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారంటే మీ క్యారెక్టరేమిటో చెప్పకనే చెబుతున్నారు. ఎదుట వారిపై కామెంట్ చేయడం చాలా ఈజీ. మీ ఐడియాలు మరొకరపై రుద్దడం సమంజసం కాదు. ఇలాంటి జడ్జిమెంట్లు ముందు మానుకోండి.!” అంటూ సామ్ చాలా ఘాటుగా స్పందించింది. ఇక సమంత రిప్లై పట్ల ఆమె అభిమానులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు.