Samantha Ruth Prabha: ఊ అంటావా మామ… ఊఊ అంటావా మామ.. అంటూ కుర్రకారుని ఉర్రూతలూగిస్తున్న అగ్ర కథానాయిక, ఐటమ్ బాంబ్ సమంత మాంచి జోరు మీద ఉంది. ఆకాశమే హద్దు అన్నట్లుగా స్వేచ్ఛగా విహరిస్తూ తనకి నచ్చిన సినిమాలు, పాటలు చేసేస్తోంది. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత కాస్త గ్లామర్ పాత్ర అయినా సరే ఓకే చెప్పేస్తోంది. ఈమెకు ఉన్న పాపులారిటీని వాడుకోవాలని, సెగలు పుట్టించే గ్లామర్ పాత్రలు చేయించాలని దర్శక నిర్మాతలు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమెను రెండు అగ్ర హీరోల సరసన నటింపజేసేందుకు ఇద్దరు దర్శకులు ముందుకు వచ్చారని తెలుస్తోంది. దీంతో నాగచైతన్యతో పెళ్లి పెటాకులు అయ్యాక ఆమెకు ఇదే అతి పెద్ద గుడ్ న్యూస్ గా మారింది.
జూ.ఎన్టీఆర్, మహేష్ బాబులతో నటించే సదవకాశం
సినీ వర్గాల్లో సమంతను కొరటాల శివ సంప్రదించినట్లు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR) 30వ సినిమాలో హీరోయిన్ గా పాటించాలని కొరటాల శివ ఈ ముద్దుగుమ్మను అడిగినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని సీక్రెట్ గా ఉంచాలని.. చివర్లో మాత్రమే సమంత ఆన్ బోర్డ్ అని ప్రకటించాలని చిత్రబృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే మహేష్ బాబు (Mahesh Babu) నెక్స్ట్ చేయబోయే సినిమాలో కూడా ఆమెను హీరోయిన్ గా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ అగ్ర హీరోల సరసన నటించే ఛాన్స్ వస్తే.. ఇటీవల కాలంలో ఆమెకు ఇదే ఒక పెద్ద శుభవార్త అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు.
సమంతా నెక్స్ట్ ప్లాన్స్
సమంత ( Samantha) ప్రస్తుతం తెలుగులో ‘శాకుంతలం’, ‘యశోద’, తమిళంలో ‘కాతు వకుళ రెండు కాదల్’ సినిమాల్లో నటిస్తోంది. ఈ 3 సినిమాలు 2022లో విడుదల కానున్నాయి. సామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో నిర్మించే ఒక ఓటీటీ ప్రాజెక్ట్‌పై కూడా సంతకం చేసింది.