Samantha: ‘అతని వల్ల కాలేదు .. ఓడిపోయాడు’ వీడియో లో లైవ్ లో చెప్పేసిన సమంత

samantha
Share

Samantha: సౌత్ ఇండస్ట్రీలోనే కాదు నార్త్ ఇండస్ట్రీలోనూ తనకంటూ ప్రత్యేకమైన పాపులారిటీ దక్కించుకున్న సినీ నటి సమంత కదలికలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. దీనికి కారణం ఈ ముద్దుగుమ్మ ప్రేమించి పెళ్లి చేసుకున్న చైతు నుంచి విడిపోవడమే. విడాకుల తర్వాత ఆమె నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఎలాంటి సినిమాలు చేయబోతోంది? ఎక్కడికి వెళ్తుంది? ఎవరిని కలుస్తుంది? ఇలా అన్ని విషయాలు తెలుసుకోవాలని సినీ అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే సమంత, చైతు మధ్య మనస్పర్ధలు రావడానికి కారణం ఆమె స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్‌యేనని అప్పట్లో పుకార్లు షికారు చేశాయి. వీరిద్దరి మధ్య ఏం నడుస్తుందో తెలుసుకోవాలని అప్పట్లో చాలామంది ఆసక్తి కూడా కనబరిచారు. అయితే చాలా రోజుల వరకు సమంత, జుకల్కర్‌ ఇద్దరు కూడా ఒకరికి ఒకరి గురించి ఎలాంటి పోస్టులు పెట్టలేదు. అయితే తాజాగా సమంత.. ప్రీతమ్ జుకల్కర్‌ (preetham jukalker) గురించి ఏకంగా తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో ఒక పోస్టే పెట్టింది. ప్రీతమ్ ను ఉద్దేశించి నీవల్ల కాలేదంటూ కొంటెగా నవ్వుతూ ఆమె షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

Samantha: ఇంతకీ ఆ పోస్ట్ ఏంటి

samantha

సమంత ఫిట్‌నెస్‌ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంటుంది. కొత్త కొత్త వర్కౌట్స్ చేస్తూ ఎప్పుడూ చెమట చిందించటం ఆమెకు అలవాటే. ఇందులో భాగంగా ఆమె ప్రస్తుతం లెవల్‌ అప్‌ అనే కొత్త వర్కవుట్‌ ప్రాక్టీస్ చేస్తోంది. దీన్ని సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసి దానికి సంబంధించిన వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది. అంతేకాదు ఈ కష్టతరమైన వర్కవుట్‌ ఛాలెంజ్‌ను తన హెయిర్ స్టైలిస్ట్ రోహిత్ భట్కర్, మేకప్ ఆర్టిస్ట్ రంభియా, ప్రీతమ్ జుకల్కర్‌లకు విసిరింది.

అతని వల్ల కాలేదు.. ఓడిపోయాడు..

samantha

సమంత విసిరిన ఛాలెంజ్‌ను రోహిత్‌ విజయవంతంగా ఫినిష్ చేయగా.. రంభియా దారుణంగా ఫెయిల్ అయ్యింది. ఇక ప్రీతమ్‌ ఈ వర్క్ ఔట్ చేయలేక బోర్ల బొక్కల పడ్డాడు. ఇది చూసి వెక్కిరింపుగా సమంత తెగ నవ్వేసింది. “నేను ఎంకరేజ్‌ చేయాలనుకున్నా.. కానీ ప్రీతమ్‌ వల్ల కాలేదు.. పాపం ఓడిపోయాడు” అని లైవ్ లో చెబుతూ సమంత అతడి వీడియోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీంతో అందరూ అవాక్కవుతున్నారు. ఇకపోతే వరుసగా సినిమాలు చేస్తూ వెళ్తున్న సమంత ఇప్పుడు ‘అరెంజ్‌మెంట్స్‌ ఆఫ్‌ లవ్‌’ అనే ఓ హాలీవుడ్‌ సినిమా చేస్తోంది. ఇందులో ఈ ముద్దుగుమ్మ బై-సెక్సువల్‌ అమ్మాయిగా కనిపించనుందట.

Samantha: పాపంరా సమంత! ఏం తప్పు చేసిందని ఇలా చేస్తున్నారు.. జాలి లేదా?


Share

Related posts

అంబటి రాంబాబు టైమ్ అస్సలు బాగా లేదా?

Yandamuri

బార్లు ఇక బార్లా ..!!

Special Bureau

Brutal Murder: కన్న బిడ్డలిద్దరిని కర్కశంగా తుపాకీతో కాల్చి చంపాడు..! హత్యకు అతను చెప్పిన కారణం విని పోలీసులు షాక్..?

bharani jella