Samantha: ఇటీవలికాలంలోగాని మనం చూసుకుంటే సమంత పైన వార్తలు సోషల్ మీడియాలో జోరుగానే షికారు చేస్తున్నాయి. సామ్ చేతో విడాకుల అనంతరం మరిన్ని వార్తలు హల్ చల్ చేసాయనే చెప్పుకోవాలి. ఎవరు ఎలావున్నా ఓ వర్గం వారు మాత్రం సామ్ ని చాలా రకాలుగా ట్రోల్ చేసారు. అయితే వాటన్నిటిని సామ్ ఎంతో ధైర్యంగా ఎదుర్కొని ముందుకు దూసుకుపోతోంది. ప్రస్తుతం సామ్ చేతిలో అనేక సినిమాలు వున్నాయి. అందులో ఎంతో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్స్ కూడా వున్నాయి.
Samantha: తాజాగా ఓ మీడియా సమావేశంలో సామ్ ఈ విధంగా మాట్లాడారు..
తాను జీవితంలో చాలా రకాలుగా మానసిక సమస్యలను ఎదుర్కొన్నానని, అలాంటి సమయాలలో తన స్నేహితులు ఎంతో అండగా వున్నారని చెప్పుకొచ్చారు. అలాగే శరీరానికి దెబ్బ తగిలితే ఏవిధంగా అయితే మనం వైద్యం చేసుకుంటామో, అలాగే మనసుకి గాయం తగిలినప్పుడు కూడా అదేవిధంగా వైద్యం అవసరం ఏర్పడుతుందని అన్నారు. తాజాగా రోష్ని ట్రస్ట్ ఓపెనింగ్ కార్యక్రమానికి హాజరైన ఆమె పై విధంగా విలేఖరులతో మాట్లాడారు.
సమంత తాజా ప్రాజెక్ట్స్ ఇవే..
చైతో విడిపోయన తరువాత సామ్ మంచి ఫామ్ లోకి వచ్చింది. వరుస సినిమాలకు సైన్ చేస్తూ మంచి జోష్ మీద వుంది. గుణశేఖర్ దర్శకత్వంలో సామ్ నటించిన ‘శాకుంతలం’ షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. అలాగే ఇక పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ‘యశోధ’ సినిమా ఒక షెడ్యూల్ పూర్తై, రెండో షెడ్యూల్ దిశగా అడుగులు వేస్తోంది. ఇది మొత్తం 5 భాషలైనటువంటి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో ఏకకాలంలో రూపొందుతుంది.