Samantha : ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత, స్టార్ హీరో నాగ చైతన్య (Naga Chaitanya) ప్రేమించి పెళ్లి చేసుకొని టాలీవుడ్ లో మోస్ట్ రొమాంటిక్ కపుల్ గా పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే ఏడేళ్లు ఘాటుగా ప్రేమించుకున్న వీళ్లిద్దరూ నాలుగేళ్లు కూడా పెళ్లి బంధంలో ఉండలేకపోయారు. వెరసి విడాకులు తీసుకొని అందరికీ షాక్ ఇచ్చారు. అయితే విడిపోవడానికి పెద్ద కారణమే ఉందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ వివాదం గురించి సంచలన వార్తలు వెలుగు చూశాయి. పిల్లల్ని కనాలని ఎంత ఒత్తిడి చేసినా సమంత తన అందం కోసం ప్రెగ్నెన్సీ (Pregnancy) వాయిదా వేస్తూ వచ్చిందని.. ఈ విషయంలోనే వీరి మధ్య గొడవ చినికి చినికి గాలివాన అయిందని కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో “మీరు ప్రెగ్నెంటా, మేడమ్?” అని ప్రశ్నిస్తే సమంత బాంబు పేల్చింది.
Samantha : “అవును గర్భవతినే ” బాంబు పేల్చిన సమంత
ప్రెగ్నెన్సీ ప్రశ్నకు సమంత అందరూ షాక్ అయ్యేలా సమాధానం ఇచ్చింది. “అవును, నేను పెళ్లి అయిన సమయం నుంచి అంటే 2017 నుంచి గర్భవతినే. కానీ ఈ పాప కడుపులో నుంచి బయటకు రావాలని కోరుకోవడం లేదు. ఏం చేస్తాం” అని బదులు ఇచ్చింది. అయితే ఇలా వ్యంగ్యంగా చెప్పినప్పటికీ.. “అవును, నేను ప్రెగ్నెంట్ నే” అని మొదట ఆమె నోటి నుంచి వచ్చిన పదాలను విని తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఏదేమైనా సమంత (Samantha Ruth Prabhu) ఇప్పుడు, అప్పుడు.. ఎప్పుడూ కూడా ఎప్పటిలాగే సమాధానం చెప్తూ తన మెంటల్ బ్యాలెన్స్ ఏంటో నిరూపించుకుంది.
టాటూపై స్పందించిన సామ్
ఇంటర్వ్యూలో నాగచైతన్య కు సంబంధించిన టాటూలపై కూడా ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో అవి తమకు చాలా స్పెషల్ అని సమంత రిప్లై ఇచ్చింది. ఏదేమైనా ప్రెగ్నెన్సీ గురించి సెటైరికల్ గా సమాధానమిచ్చి అభిమానులను ఒక్క క్షణం పాటు నివ్వెరపరిచి ఆపై నవ్వించేసింది సమంత.