న్యూస్ సినిమా

Samantha : ‘వాళ్ళు లేకపోతే చనిపొయే దాన్ని’ బాంబు లాంటి విషయం బయటపెట్టిన సమంత!

samantha
Share

Samantha : ఇటీవలి కాలంలో సమంత వరుస సినిమాలు చేస్తూ ఫుల్ జోష్ తో ముందుకు పోతోంది. ఈమధ్యే విడుదలైన పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ లో సామ్ తన మార్క్ ను చూపించింది. ఇకపోతే, చైతూతో విడాకుల తర్వాత తొలిసారి ఆమె తన స్నేహితురాలితో కలిసి బద్రీనాథ్ తీర్థయాత్రలకు వెళ్ళింది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె స్విట్జర్లాండ్ టూర్ కి వెళ్ళింది. అక్కడ తెల్లటి మంచు అందాలను ఆస్వాదిస్తూ ఆ మంచు కొండల నడుమ సాహస క్రీడల్లో పాల్గొంటోంది. స్కీయింగ్ చేస్తూ ఉల్లాసంగా కాలాన్ని గడుపుతోంది.

Samantha : అక్కడ జరిగింది ఇదే..

samantha

తాజాగా దానికి సంబంధించిన వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో సామ్ షేర్ చేసింది. తానింకా బతికున్నానంటే కారణం ఆ ఇద్దరేనంటూ స్కీయింగ్ శిక్షకులు ఆంటోనీ, కేట్ మెక్ బ్రైడ్ లను ఆమె ట్యాగ్ చేసి పరిచయం చేసింది. ‘స్కీయింగ్ అంటే నమ్మకం’ అంటూ ఇన్ స్టా స్టోరీస్ లో పోస్ట్ పెట్టింది. ‘‘స్కీయింగ్ అంటే ఎంతో సాహసోపేతమైనది. అంత సులభం కాదు. అయినా చాలా బాగుంది’’ అని సమంత రాసుకొచ్చింది. ఇక ఆమె సాహసాన్ని చూసి నెటిజన్లు గులాం అయిపోయారు.

సింగర్ చిన్మయి స్పందన ఇదే..

samantha

‘‘నువ్వు అనుకున్నది సాధించడానికే పుట్టావు. ఏదైనా పోటీలో పాల్గొని బంగారు పతకం సాధించి తీసుకురా’’ అంటూ సింగర్ చిన్మయి సమంత పోస్ట్ కు రిప్లై ఇచ్చింది. అలాగే తాను స్కీయింగ్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేసి ఓ పొయెట్రీని రాసుకొచ్చింది సమంత. ‘‘నాకు మరో చాన్స్ ఇవ్వు. ఎండలో నీడలా ఉండు. ఈ ప్రపంచం ఆది నుంచీ నడుస్తోందని నాకు చెప్పు. అంతా మంచే జరుగుతుందన్న ధీమాని నాకు ఇవ్వు. ఎండలో నీడలా ఉండు’’ అంటూ రాసుకొచ్చింది.


Share

Related posts

మీ గడ్డం చూసినవారు కూడా ఇలానే అంటున్నారా? ఇది తెలుసుకుంటే గడ్డం పెంచని వారు కూడా పెంచేస్తారు..

Kumar

నిత్యా స్థానంలో సాయిప‌ల్ల‌వి

Siva Prasad

Eatela Rajendar: ఈట‌ల‌ విష‌యంలో కేసీఆర్ ఎక్కువ ప‌రేషాన్ అవుతున్న‌ది ఎందుకంటే…

sridhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar