సమంత ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… ఒకే యాంగిల్ లో సమంతను చూసిన ప్రేక్షకులను ఆశ్చర్యపరచడానికి సిద్ధమవుతోందండోచ్.. అవును ఇంతవరకు మీరెప్పుడూ చూడని సమంత మన ముందుకు రాబోతోంది. తన అందచందాలతో, తనదైన నటన ప్రతిభతో ఎంతో మంది ప్రేక్షకుల ఆదారాభిమానాలను సొంతం చేసుకున్న ఈ బ్యూటీ సరికొత్త యాంగిల్ తో అభిమానులను కవ్వించడానికి సిద్ధమైంది. మరీ ముఖ్యంగా లాక్ డౌన్ సమయం నుంచి ఆమె తన ప్రత్యేకతలను బయటపెడుతున్నారు. వరుస సినిమాలతో బిజీగా ఉండే ఈ అమ్మడు వాటికి బ్రేక్ ఇచ్చిందనే చెప్పవచ్చు.
ఫ్యామిలీతో సరదాగా గడుపుతూ ఎంజాయ్ చేస్తుంది. ముఖ్యంగా సినిమాలకు కొంత బ్రేక్ వేసి వెబ్ సిరీస్, డిజిటల్ ప్లాట్ ఫామ్ పై ధృష్టి సారించింది ఈ అందాల రాశి. కాగా ఈ ముద్దుగుమ్మ ప్రముఖ హీరోల సరసన చేసి తన క్రేజ్ ను అమాంతం పెంచేసుకుంది. కాగా పెళ్లి తర్వాత అక్కినేని సమంత సినిమాలపై ఇంట్రెస్ట్ చూపడం లేదంటూ వార్తలు వినిపిస్తున్నాయి. వ్యక్తిగత లైఫ్ లో బిజీగా ఉంటూ సినిమాలకు దూరంగా ఉంటుందంటూ వార్తలు వస్తున్నాయి.
కాగా సినిమాల ఆఫర్లు భారీగా వస్తున్నా వాటిని పట్టించుకోవడం లేదు సమంత. మంచి మంచి డైరెక్టర్ల నుంచి సినిమా చాన్సులు వస్తున్నా వాటిని ఒప్పుకోవడం లేదంటున్నారు కొందరు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ హౌస్ లో దసరా కానుకగా ఆమె తన మామ నాగార్జునకు బదులుగా బిగ్ బాస్ లో హోస్ట్ గా చేసి షో కి మంచి రేటింగ్ కూడా సంపాధించుకున్నారు. కాగా సమంతను యాంకర్ ను చేసే పనిలో పడ్డారు కొందరు. అల్లు అరవింద్ ఆహా ప్లాట్ ఫామ్ లో యాంకర్ గా మారనుంది ఈ ముద్దుగుమ్మ.
ఆ షో కు సంబంధించిన ప్రోమో కూడా విడుదలైంది. ఆహా ప్లాట్ ఫాం గా టాక్ షో చేయబోతుంది అక్కినేని సమంత. దీనిలో భాగంగా సిని ఇండస్ట్రీలోని ప్రముఖులతో మాట్లాడి వారి మనసులోని భావాలను పంచుకుంటారు ఈ భామ. ఈ షో నవంబర్ 13 నుంచి ఇది ప్రారంభం కాబోతోంది. చూడాలి మరి అక్కినేని సమంత ఎలా షో ను నిర్వహిస్తారనేది. ఈ షో ద్వారా తన ఫ్యాన్స్ ను ఆనందించడానికి సిద్ధమవుతోంది ఈ బ్యూటీ.