Samantha: నాగచైతన్య, సమంత ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లైన నాలుగేళ్లకు ఈ జంట విడాకులు తీసుకున్నారు. ఈ విషయాన్ని అటు సమంత అభిమానులు.. ఇటు చైతు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. చైతు-సామ్ తమ విడాకుల విషయాన్ని ప్రకటించి మూడు నెలలు దాటినా.. ఇప్పటికీ ఈ విడాకుల మేటర్ ఇంకా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉంది. విడాకుల గురించి చైతూ ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు. సామ్ మాత్రం అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా అడపా దడపా పోస్ట్లు పెడుతూ విడాకులు తీసుకున్న తర్వాత తానెంత ఇబ్బంది పడుతున్నాననే విషయాన్ని ఇండైరెక్ట్ గా చెబుతుంది.
PRC: పీఆర్సీ డ్యామేజీ కంట్రోల్ కు రంగంలోకి దిగిన వైసీపీ హైకమాండ్! వాస్తవాలు వివరించాలంటూ పార్టీ శ్రేణులకు సర్క్యులర్ జారీ!
Samantha: హాట్ టాపిక్ గా విడాకుల వార్తలు..
అయితే, ఈ విషయం మరిచిపోకముందే తమిళ హీరో ధనుష్ ఐశ్వర్య లు విడాకులు తీసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు మెగాస్టార్ కుమార్తె శ్రీజ, అల్లుడు కళ్యాణ్ దేవ్ విడిపోతున్నారు అంటూ వార్తలు వెల్లువెత్తున్నాయి. సోషల్ మీడియాలో ఇదే అంశంపై దుమారం రేగుతోంది, ఇది నిజమా , కల్పితమా అన్న చర్చ నడుస్తోంది.
Intinti Gruhalakshmi: తులసి విశ్వరూపం చూసిన నందు.. కోడళ్ళ కి క్లాస్.. పూజ చేయడానికి లాస్య ఎలాంటి స్కెచ్ వేసిందంటే..!!
విడాకులపై సమంత ట్వీట్ వైరల్..
కాగా, సమంత విడాకులపై చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. ఆ ట్వీట్ పెళ్ళికి ముందు చేశారు ఆమె. ఓ నెటిజన్ విడాకులపై మీ అభిప్రాయం ఏంటని.. ట్విట్టర్ వేదికగా ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు సమంత స్పందిస్తూ.. నేను పెళ్లి చేసుకుంటాను.. తర్వాత విడాకులు కూడా తీసుకుంటాను. నేను విడాకులు తీసుకున్న తర్వాత మనిద్దరం కలిసి హాయిగా డాన్స్ వేసుకుందాం అంటూ సామ్ సదరు నెటిజన్ కి జవాబు చెప్పింది. కాగా, ఇప్పుడు ఈ ట్వీట్ ని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. విడిపోవడానికి పెళ్లి చేసుకోవడం ఎందుకంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.