Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్స్ లలో సమంత కూడా ఒకరని చెప్పడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి. వరుస సినిమాలతో, డిఫరెంట్ కథలతో ఎప్పటికప్పుడు తనలోని టాలెంట్ ని ప్రేక్షకులకు పరిచయం చేస్తూ టాప్ పొజిషన్లో ఉంది. నాగ చైతన్యతో విడాకుల వ్యవహారం తరువాత కూడా సినిమాల విషయంలో తన జోరు ఏ మాత్రం తగ్గలేదనే చెప్పాలి. వరసపెట్టి వచ్చిన ప్రాజెక్ట్స్ అన్నిటికి ఒకే చెప్పేస్తూ వస్తుంది. ఇప్పటికే కొన్ని చిత్రాల్లో నటించేందుకు రెడీ అయింది కూడా. త్వరలో సామ్ నటించిన శాకుంతలం సినిమా కూడా రిలీజ్ కు రెడీ అయింది. ఒక్క తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ లలో కూడా ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకుపోతోంది.
Samantha: పబ్ లో రచ్చ చేస్తున్న సమంత …!
సామ్ క్రెజ్ ఏంటో చెప్పడానికి ఈ ఒక్క పాట చాలు :
ఈ క్రమంలోనే సామ్ క్రేజ్ ఏంటో ఈ పాటతో అందరికి తెలియనుంది. గతంలో అల్లు అర్జున్ సరసన సన్ అఫ్ సత్యమూర్తి సినిమాలో నటించిన సమంత మరొకమారు అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్లో నటించేందుకు ఓకే చెప్పింది. గత కొన్ని రోజులుగా సామ్ పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు అనే వార్త వైరల్ గా మారగా ఇప్పుడు ఆ వార్తను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ పాటతో సమంత క్రేజ్ ఇంకా పెరగనున్నట్లు తెలుస్తుంది. ఈ స్పెషల్ సాంగ్ చిత్రీకరణ ఈ నెల 26 నుంచి ప్రారంభం కానుంది.
Samantha: ఇండస్ట్రీలో చాలామంది సమంతవైపే ఉన్నారు..అందుకు కారణాలు ఇవే..!
నాలుగు రోజుల షూటింగ్ కోసం రెండు కోట్లా :
ఈ పాట కోసం సమంత భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ పాట కేవలం 5 నిమిషాల మాత్రమే ఉంటుందట. అలాగే కేవలం నాలుగు రోజులు మాత్రమే షూటింగ్ జరగనుందట. ఐదు నిమిషాల పాట, నాలుగు రోజుల షూటింగ్ కోసం ఏకంగా రెండు కోట్లు ఇస్తున్నారట. దీన్ని బట్టి సామ్ క్రెజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంట. కాగా ఈ పాట సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని చిత్ర యూనిట్ చెప్తున్నారు. అందుకే అంత రెమ్యునిరేషన్ ఆఫర్ చేస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే రెమ్యునిరేషన్ విషయంలో అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.