Samantha: పాన్ ఇండియన్ సినిమా పుష్ప ఈ నెల డిసెంబర్ 17న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మోస్ట్ వాంటెడ్ బ్యూటి రష్మిక మందన్న జంటగా నటించిన ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించాడు. రెండు భాగాలుగా రాబోతున్న పుష్ప మూవీ పార్ట్ 1 పుష్ప ది రైజ్ రిలీజ్ డేట్ దగ్గరపడుతోంది. యావత్ సినీ లవర్స్ అందరూ ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురూచుస్తున్నారు. ఇప్పటికే పుష్ప సినిమా నుంచి నాలుగు పాటలు వచ్చి యూట్యూబ్‌లో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి.

ఇలాంటి సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత సాంగ్ ఉంటే ఎలా ఉంటుంది. అది కూడా సుకుమార్ స్పెషల్ మేకింగ్, రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ కంపోజ్ చేసిన స్పెషల్ నంబర్ అయితే ఇంకెలా ఉంటుంది. ఇందులోనే సమంత ఘాటు ఘాటుగా నాటు నాటుగా మాస్ ఆడియిన్స్‌కు మెంటలెక్కించే స్టెప్స్ వేస్తే..చురకత్తుల్లాంటి చూపూలతో రెచ్చగొడితే..ఇక ఆ సాంగ్ గురించి చెప్పడానికి మాటల చాలవు. ఇప్పుడు పుష్ప సినిమా నుంచి వచ్చిన సమంత స్పెషల్ సాంగ్ అదే రేంజ్‌లో ఉంది. స్పెషల్ సాంగ్ కంపోజ్ చేయాలంటే దేవీ తర్వాతే ఏ మ్యూజిక్ డైరెక్టరినా…
Samantha: దాన్ని తెరకెక్కించాలంటే సుక్కూ తర్వాతే ఏ దర్శకుడైనా..!
దాన్ని తెరకెక్కించాలంటే సుక్కూ తర్వాతే ఏ దర్శకుడైనా ..ఆ టాక్ ఇప్పుడు సమంత చేసిన ఐటెం సాంగ్ ఉ అంటావా మావ.. ఉ ఊ అంటావా మావా సాంగ్ చూసిన అందరూ చెపుకుంటున్నారు. సమంతను ఇప్పటి వరకు చూడని ఓ మాస్ నంబర్‌లో ప్రేక్షకులు చూడబోతున్నారు. ఈ సాంగ్ చూసి ఎంతమందికి చమటలు పడతాయో చెప్పడం కష్టం అనేలా ఉంది. ఇక సమంత స్పెషల్ నంబర్ రిలీజ్ ఐన కొద్దిసేపట్లోనే యూట్యూబ్‌లో రికార్డ్ స్థాయిలో వ్యూస్ రాబడుతూ ట్రెండింగ్‌లో నిలుస్తోంది. చూడాలి మరి ఈ సాంగ్ ఎన్ని మిలియన్స్ వ్యూస్ రాబట్టి సంచలనం సృష్ఠిస్తుందో.