Pushpa: పుష్ప సినిమాకు సంబంధించిన హాట్ టాపిక్స్‌లో సమంత చేస్తున్న స్పెషల్ ఐటం సాంగ్ ఒకటి. పుష్ప సినిమా మొదలైనప్పటి నుంచి ఈ ఐటెం సాంగ్ గురించే అందరూ మాట్లాడుకున్నారు. అందుకు కారణం మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీప్రసాద్. రాక్‌స్టార్ దేవీశ్రీప్రసాద్ ఆల్బం అంటే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సాంగ్స్ అన్నీ ఏ రేంజ్లో హిట్ అవుతాయో. ఇక సుకుమార్ – అల్లు అర్జున్ – దేవీ కాంబినేషన్ అంటే అభిమానుల్లోనే కాదు అందరిలోనూ వేరే లెవల అంచనాలుంటాయి.
ఆ అంచనాలను ఇప్పటి వరకు వచ్చిన పుష్ప సినిమాలోని సాంగ్స్ నిరూపించాయి. ఐకాన్ స్టార్‌తో సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియన్ సినిమాలో మోస్ట్ వాంటెడ్ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ – ముత్యం శెట్టి మీడియా కలిసి 200 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో దేవీశ్రీప్రసాద్ స్పెషల్‌గా కంపోజ్ చేసిన ఐటెం సాంగ్ షూటింగ్ జరుగుతోంది. మరో రెండు రోజుల్లో ఈ ఐటెం సాంగ్ చిత్రీకరణ పూర్తవుతుఇంది.
ఇది పుష్ప మూవీ నుంచి రాబోతున్న 5వ పాట. ఈ పాట కోసమే ఇప్పుడు ప్రతీ ఒక్కరు ఎదురుచూస్తున్నారు. ఈ పాట కోసం సుక్కూ బృందం బాలీవుడ్ నుంచి నోరా ఫతేహీ, దిశా పఠానీ, ఊర్వశీ రౌతెలా లాంటి హాట్ బ్యూటీస్‌ను తీసుకురాబోతున్నట్టు, ఈ సాంగ్ కోసం భారీగా రెమ్యునరేషన్ ఇస్తున్నట్టు వార్తలు వచ్చాయి. వాటన్నికిటీ చెక్ పెడుతూ ఇటీవల సమంత పేరు ప్రకటించి షాక్, సర్ప్రైజ్ ఒకేసారి ఇచ్చారు. ఇప్పుడు ఈ సాంగ్ నుంచి సమంత బ్యాక్‌సైడ్ లుక్ రివీల్ చేసి అంచనాలు విపరీతంగా పెంచారు. త్వరలో ఈ సాంగ్ ప్రమోను వదలబోతున్నారు. ఇక తాజాగా వదిలిన సమంత లుక్ వైరల్ అవుతోంది.
దక్షిణాది సినిమా రంగంలో తుని దారులకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా తమిళ సినిమా రంగంలో అయితే హీరో లేదా హీరోయిన్ నచ్చాడు అంటే విగ్రహాలు కట్టేస్తారు...…
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన "పుష్ప" ఎంతటి ఘనవిజయం సృష్టించిందో అందరికీ తెలుసు. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా…
ఢిల్లీ నూతన ఎక్సేజ్ పాలసీ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) హైదరాబాద్ లోని ఓ ప్రముఖ వ్యాపారి నివాసంలోనూ తనిఖీలు చేసింది. హైదరాబాద్ కోకాపేటలోని ప్రముఖ…
విభిన్న చిత్రాలకు కేరాఫ్‌గా మారిన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్.. రీసెంట్గా `కార్తికేయ 2`తో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. 2014లో విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్…
విజయవాడ కు చెందిన పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్ధిని (17) గత నెల 22వ తేదీన ఏలూరు కాలువలో దూకింది. రాత్రి సమయంలో అందరూ చూస్తుండగానే…
ఒకప్పటి హీరోయిన్ నమిత పండండి కవలలకు జన్మనిచ్చింది. ఈ గుడ్‌న్యూస్‌ను ఆమె నేడు కృష్ణాష్టమి సందర్భంగా రివిల్ చేసింది. `జెమిని` మూవీతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు…