Pushpa: పాన్ ఇండియన్ సినిమా పుష్ప మరికొన్ని రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్‌లోకి రాబోతోంది. సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – మోస్ట్ వాంటెడ్ బ్యూటీ రష్మిక మందన్న జంటగా పాన్ ఇండియన్ రేంజ్లో తెరకెక్కిన పుష్ప: ది రైజ్ పార్ట్ 1 డిసెంబర్ 17న థియేటర్స్‌లో సందడి చేయడానికి రెడీ అవుతోంది. దాదాపు 250 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి అసాధారణమైన అంచనాలను పెంచిన ఈ సినిమా ప్రమోషన్స్ భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది చిత్రబృందం.
ఆ తర్వాత చెన్నైలో ప్రమోషన్స్ జరిపారు. ప్రస్తుతం బెంగుళూరులో ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఇలా పుష్ప తెరకెక్కిన అన్నీ భాషలలో ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇక ఇప్పటికే అల్లు అర్జున్, రష్మిక మందన్న, సునీల్, అనసూయ, ఫహాద్ ఫాజిల్ లుక్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఒక్కో సాంగ్ రిలీజై యూట్యూబ్‌లో రికార్డ్ స్థాయిలో వ్యూస్ రాబట్టి పుష్ప సినిమా రేంజ్‌ను భారీ స్థాయిలో పెంచాయి. అయితే ఇటీవల వచ్చిన సమంత స్పెషల్ ఐటెం సాంగ్ వాటన్నిటినీ మించి ట్రెండ్ అవుతోంది.
Pushpa: సమంత సాంగ్ కోసం ఒక్కసారైనా థియేటర్స్‌కు వెళ్ళాల్సిందే..
ఊ అంటావా మావ ఊ ఊ అంటావా మావా అనే సాంగ్‌లో సమంత ఫస్ట్ పోస్టర్ రిలీజైనప్పుడే హాట్ టాపిక్ అయింది. ఇక ఇటీవల వచ్చిన లిరికల్ వీడియో సాంగ్ ఇప్పుడు సృష్ఠిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. ఇప్పటి వరకు నాలుగు సాంగ్స్ వచ్చి సూపర్ హిట్ ఐనా వాటిని మించి ఇప్పుడు నంబర్ 1 ప్లేస్‌లో సమంత ఐటెం సాంగ్ నిలిచింది. తాజాగా వచ్చిన ఈ సాంగ్ ప్రోమోతో అంచనాలు ఊహకందడం లేదు. సినిమా మొత్తానికి సమంత సాంగే హైలెట్‌గా నిలుస్తుందని ఇప్పటికే ప్రూవ్ అయింది. ఎలాంటి ప్రేక్షకులైనా సమంత సాంగ్ కోసం ఒక్కసారైనా థియేటర్స్‌కు వెళ్ళాల్సిందే..అనే ఆసక్తిని సుకుమార్ బృందం క్రియేట్ చేసింది.