Samantha: విడాకులు తీసుకున్న హీరోయిన్లు అందరితో కలిసి సమంత సూపర్ నిర్ణయం..!!

Share

Samantha: ఒకప్పుడు తమ అంద చందాలతో ప్రేక్షకులను ఊర్రుతలుగించిన అందాల ముద్దుగుమ్మలు ఈనాటికి ఒంటరిగానే జీవితం గడుపుతున్నారు. అలనాటి తరాలు అయిన టబూ, శోభన, నగ్మా, జయప్రద, రేఖ, సితార, అమీషా పటేల్‌ వంటి హీరోయిన్స్ యాభై పదుల వయసు వచ్చినాగాని ఇంకా ఒంటరిగానే జీవిస్తున్నారు. కొందరు ప్రేమలో విఫలం అయ్యి ఒంటరి జీవితం గడుపుతుంటే మరికొందరు హీరోయిన్స్ మాత్రం పెళ్లి అయ్యాక భర్తతో విడాకులు తీసుకుని వేరొకర్ని పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంటున్నారు. మరి ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత పరిస్థితి ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది. మరి 50 ఏళ్లు దాటినా ఇంకా ఒంటరి జీవితం గడుపుతున్న ఆ హీరోయిన్స్ ఎవరో ఒకసారి తెలుసుకుందామా..

  Food: ఈ తిండి తింటే చనిపోతారా..!? పరిశోధకులు ఏం చెబుతున్నారు..!?

  Samantha: ఒంటరి జీవితం గడుపుతున్న తారలు వీరే :

  అప్పట్లో తెలుగు, హిందీలో ఓ ఊపు ఊపిన హాట్‌ భామ టబూ ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. అప్పట్లో బాలీవుడ్‌ హీరో అజయ్‌ దేవగన్‌ తో ప్రేమలో పడిందని వార్తలు కూడా వచ్చాయి. కానీ అజయ్‌ దేవగన్‌..కాజోల్‌ ని పెళ్లిచేసుకోవడంతో టబు మాత్రం ఎవర్ని పెళ్లి చేసుకోకుండా ఇప్పటికి ఒంటరిగానే ఉండిపోయింది. గ్లామరస్ హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న మరో అందాల తార నగ్మా సైతం ఇప్పటికీ ఒంటరిగానే ఉంది. టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీతో ప్రేమలో పడిందిని అప్పట్లో రూమర్స్ వచ్చాయి. అప్పటినుండి ఇప్పటివరకు నగ్మా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉంది. ఇకపోతే మంచి నటిగా గుర్తింపు పొంది, రెండు జాతీయ అవార్డులు గెలుచుకుని, తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళ బాషలలో కూడా నటించిన హీరోయిన్ శోభన కూడా ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. ఓ అమ్మాయిని దత్తత తీసుకుంది., అలాగే హీరోయిన్ అమీషా పటేల్‌ సైతం ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. 46ఏళ్ల ఈ భామ ఫిల్మ్ మేకర్‌ విక్రమ్‌ భట్‌తో ప్రేమలో పడింది. ఆ తరువాత అనేక వివాదాల అనంతరం వీరిద్దరు బ్రేకప్‌ చెప్పుకున్నారు. ఆ తర్వాత వ్యాపారవేత్త కనవ్‌ పూరితో ప్రేమలో ఉన్నట్టు ప్రకటించి పదేళ్లు అవుతున్నా ఇంకా పెళ్లి చేసుకోలేదు.

  Special trains: సంక్రాంతి పండుగకు ఊరికి వెళ్తున్నారా .. అయితే మీకు ఒక గుడ్ న్యూస్ …!
  ప్రేమ విఫలం అవ్వడంతో పెళ్లిళ్లు మానేసిన తరాలు :

  క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా రాణిస్తున్న సితార సైతం మ్యారేజ్‌ చేసుకోలేదు. ఆమె తమిళ నటుడు మురళీ ప్రేమలో పడి కొన్ని కారణాలతో వీరిద్దరు విడిపోయారు. లవ్ ఫెయిల్యూర్ కావడంతో హర్ట్ అయిన సితార ఇప్పటికీ ఒంటరిగానే ఉండిపోయింది. అలనాటి అందాల తార రేఖ ఇప్పటికీ ఒంటరిగానే ఉంటుంది. ఆమె 1990లో ఢిల్లీ బేస్డ్ వ్యాపారవేత్త ముఖేష్‌ అగర్వాల్‌ని వివాహం చేసుకుంది. కానీ ఆయన అదే ఏడాది ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంకా అప్పటినుంచి రేఖ ఒంటరిగానే ఉండిపోయింది. అలనాటి మేటి అందాల తార జయప్రద కూడా ఇప్పటికి సింగిల్‌ గానే ఉంది. ఆమె 1986లో నిర్మాత శ్రీకాంత్‌ నహతాని వివాహం చేసుకుంది. కానీ అప్పటికే అతనికి పెళ్లై ముగ్గురు పిల్లలున్నారు. ఈ విషయం తెలిసి అనేక వివాదాలు చోటు చేసుకున్నాయి. దీంతో ఆయనకు దూరంగా ఒంటరి జీవితం గడుపుతుంది. ఇంకా సీనియర్‌ నటి నిర్మల కూడా మ్యారేజ్‌ చేసుకోలేదు. మరో సీనియర్‌ నటి `ముత్యాల ముగ్గు` సంగీత కూడా ఒంటరిగానే ఉంది.

  సామ్ కూడా ఒంటరిగానే మిగలనుందా..? లేదంటే పెళ్లి చేసుకొనుందా..?

  ఇప్పుడు వీరి బాటలోనే సమంత కూడా నడవనుందా.. సామ్ ప్రయాణం ఎటువైపో అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సమంత కూడా ఇకమీదట వీరి జాబితాలో చేరబోతుందా..?మళ్ళీ పెళ్లి చేసుకుంటుందా..? లేక ప్రేమ, పెళ్లి విఫలం అవ్వడంతో ఒంటరిగానే జీవితం కొనసాగిస్తుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సమంత ఎంతగానో ప్రేమించి నాగచైతన్యని పెళ్లి చేసుకున్నది..2017లో వీరిద్దరి గ్రాండ్‌ గా వివాహం చేసుకున్నారు. సరిగ్గా నాలుగేండ్లకి అంటే గతేడాది అక్టోబర్ 2న విడిపోతున్నట్టు ప్రకటించారు. ప్రేమ పెళ్లిలో విఫలమైన బాధలో ఉన్న సమంత మునుపటికంటే మరింత రెట్టింపు ఉత్సాహంతో కెరీర్‌ పై దృష్టి సారించిందనే చెప్పాలి


  Share

Related posts

వరలక్ష్మీ శరత్‌కుమార్ కి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ మించిన అవకాశాలు..!

GRK

ఆర్ ఆర్ ఆర్ లో ఎన్.టి.ఆర్, రాం చరణ్ ల మధ్య రిలేషన్ ఇదే అయితే ఎన్ని రికార్డులో ..!

GRK

Mukku Avinash : ముక్కు అవినాష్ కు తన ముక్కే సమస్యగా మారిందా?

Varun G