Samantha: ఆ కుర్ర హీరోతో సమంత రొమాన్స్.. బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌..!

Share

Samantha: అగ్ర కథానాయిక సమంత తన హిందీ వెబ్ సిరీస్‌ని ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2తో ప్రారంభించింది. అప్పటి నుంచి హిందీ సినిమాల్లో సమంత ఎప్పుడు చేస్తుందో అని సినీ ప్రియులు ఎదురు చూస్తున్నారు. అయితే, సినీ ఇండస్ట్రీ నుంచి అందుతున్న తాజా సమాచారం ప్రకారం, సమంత ఆయుష్మాన్ ఖురానా సరసన బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. కామెడీ, సస్పెన్స్‌తో వంటి కమర్షియల్ ఎలిమెంట్స్‌తో రానున్న ఈ మూవీని మాడాక్ ఫిల్మ్స్, పీపింగ్ మూన్ బ్యానర్‌పై దినేష్ విజన్ నిర్మించనున్నారు.

Samantha: కుర్ర హీరోతో సమంత రొమాన్స్

సమంత తన సినీ కెరీర్‌లో ఒక్కటంటే ఒక్క హిందీ సినిమాలోనూ యాక్ట్ చేయలేదు కానీ సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. పుష్ప ఐటమ్ సాంగ్, ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ఆమెను హిందీ ప్రేక్షకులకు మరింత చేరువ చేశాయి. ఇప్పుడు ఆ క్రేజ్‌తోనే ఈ ముద్దుగుమ్మ హీరో ఆయుష్మాన్ తో నటించే ఛాన్స్ కొట్టేసింది. వీరు ఇరువురు ప్రస్తుత కమిట్‌మెంట్‌లను ముగించిన తర్వాత ఈ సస్పెన్స్ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కించే అవకాశం ఉంది. ఈ ఏడాది చివరి నాటికి ఈ మూవీ సెట్‌పైకి తీసుకెళ్లాలని సినీ బృందం భావిస్తోంది. అయితే సమంతకి మూవీ స్టోరీ బాగా నచ్చిందని కానీ ఆమె ఇంకా ఈ సినిమాకు సైన్ చేయలేదని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. సమంత మొదటి సినిమా ఇదే కావడంతో బాలీవుడ్ వర్గాల్లో ఈ హిందీ సినిమా హాట్ టాపిక్ గా మారింది.

 

నెక్స్ట్ బాలీవుడ్ ప్రాజెక్ట్స్

తాప్సీ పన్ను నిర్మించే సినిమాలో సమంత ప్రధాన పాత్రలో నటించనుందని ఇప్పటికే అధికారిక వార్తలు వచ్చాయి. ఈ ప్రాజెక్ట్‌లతో పాటు, రాజ్ డి.కె దర్శకత్వం వహిస్తున్న ‘సిటాడెల్’ ఇండియన్ వెర్షన్‌లో కూడా సమంత కనిపించనుంది. ఈ వెబ్ సిరీస్‌లో సామ్ వరుణ్ ధావన్‌తో కలిసి పని చేస్తుంది. శాకుంతలం, యశోద చిత్రాల్లో కూడా సమంత కనిపించనుంది.


Share

Recent Posts

కియారా అద్వానిపై దారుణంగా ట్రోలింగ్.. అంత తప్పు ఏం చేసింది..?

నటి కియారా అద్వానీకి అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించింది. తెలుగులో భరత్ అనే నేను సినిమాలో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ…

24 నిమిషాలు ago

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై స్పందించిన ఏపీ సీఐడీ .. ఫోరెన్సిక్ రిపోర్టుపై డీజీ ఇచ్చిన క్లారిటీ ఇది

గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…

1 గంట ago

దగ్గు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..!

చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…

1 గంట ago

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

2 గంటలు ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

2 గంటలు ago

సమంత టెన్త్ మార్క్ షీట్ లో ఇన్ని తప్పులా!

సమంత రూత్ ప్రభు.. ఇది పరిచయం అక్కర్లేని పేరు.. తన నటన ద్వారా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించింది. 2010లో గౌతమ్ మీనన్ రూపొందించిన ‘ఏ…

2 గంటలు ago