Samantha: అది ఎక్కడున్నా వెళతాను అంటున్న సమంత..తెలిస్తే వాళ్ళంతా క్యూ కడతారేమో..?

Share

Samantha: సమంత అక్కినేని ఏ మాయ చేశావే సినిమాతో సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి తన సినిమాలలో ప్రేక్షకులను మాయ చేస్తూనే ఉంది. మొదటి సినిమాతో అలా మాయ చేసే హీరో నాగ చైతన్యని ప్రేమలో పడేసింది. మొదటి సినిమా ఇద్దరికీ సూపర్ సక్సెస్ ..బ్లాక్ బస్టర్ కెరీర్ ఇచ్చింది. ఇండస్ట్రీకొచ్చి ఇన్నేళ్లవుతున్న సమంత జోరు మాత్రం అసలు తగ్గడం లేదు. పెళ్లికి ముందు ఎలాంటి గ్లామర్ రోల్స్ చేసిందో అందరికీ తెలిసిందే. ఎక్స్‌ఫోజింగ్ కూడా బాగానే చేసి ఆకట్టుకుంది. ఇండస్ట్రీకొచ్చిన మొదటి నుంచే స్టార్  హీరోలతో నటిస్తూ హిట్స్ అందుకుంది.

samantha-will go to that place wherever she may be
samantha-will go to that place wherever she may be

అయితే పెళ్లి తర్వాత సమంతలో చాలా మార్పు వచ్చింది. కథల ఎంపికలో గాని, పాత్రల ఎంపికలో గానీ పూర్తి వైవిధ్యం కనబరుస్తోంది. అందుకు ఉదాహరణ మజిలీ, ఓ బేబీ, జాను..ఇటీవల వచ్చిన ది ఫ్యామిలీ మాన్ సీజన్ 2. వీటిలో సమంత పర్ఫార్మెన్స్ అద్భుతంగా కనబరచింది. అంతేకాదు ఇకపై కూడా గ్లామర్స్ రోల్స్ కాకుండా పూర్తిగా కథా, అందులో బలమైన పాత్ర ఉంటేనే చేయాలని డిసైడయింది. ఈ క్రమంలోనే సమంత బాలీవుడ్‌లో సినిమా ఎప్పుడు చేస్తారని ఇప్పటికే చాలా సందర్భాలో ఆమెని అడిగారు.

Samantha: సమంత ఇప్పుడు కొత్తదనం ఎక్కడుంటే అక్కడికి వెళతానని చెప్పింది.

అంతకముందు ఆ దృష్ఠంతా సౌత్ ఇండస్ట్రీ మీదే అని చెప్పిన సమంత ఇప్పుడు మాత్రం కొత్తదనం ఎక్కడుంటే అక్కడికి తప్పకుండా వెళతానని చెప్పింది. దాంతో దర్శక, రచయితలు తనని దృష్ఠిలో పెట్టుకొని కొత్త తరహా కథలు సిద్దం చేస్తున్నారు. ఇటీవలే శాకుంతలం సినిమాను పూర్తి చేసింది సమంత. తాజాగా తమిళంలో నయనతార, విజయ్ సేతుపతిలతో పాటు కలిసి ఓ మల్టీస్టారర్ సినిమా షూటింగ్‌లో జాయిన్ అయింది. నయనతార కాబోయో భర్త విగ్నేష్ శివన్ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే త్వరలో కొత్త తరహా కథతో తెరకెక్కనున్న బాలీవుడ్ సినిమాలో నటించబోతోందట సమంత.


Share

Related posts

Dhee 13 : సుడిగాలి సుధీర్ పరువు తీసేసిన ఢీ 13 డైరక్షన్ డిపార్ట్ మెంట్?

Varun G

‘సోలో బ్రతుకే సో బెటర్’ ఓటిటి కి కాదు..!  పే పర్ వ్యూ పద్ధతిలో ఒకసారి చూసేందుకు ఎంతంటే….

arun kanna

పది నిమిషాల్లో ఫలితాన్నిచ్చే దక్షిణ కొరియా కరోనా కిట్లు… ప్రారంభించిన సీఎం జగన్

Siva Prasad