Chiranjeevi: చిరంజీవి కెరీర్లో అరుదైన సంఘటన ఒకే షర్ట్ రెండు సంత్సరాలు వేసుకున్నరు దేన్ని కోసమో తెలుసా..??

Share

Chiranjeevi: టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్వయంకృషితో అనేక శిఖరాలను అందుకున్న చిరంజీవి టాలీవుడ్ బాక్సాఫీస్ నీ శాసించారు. ఇండస్ట్రీలో తనకంటూ ఓ సెపరేట్ క్రేజ్ క్రియేట్ చేసుకున్న చిరంజీవి.. తెలుగు రాష్ట్రాలలో ప్రజల  అభిమానం సంపాదించుకుని.. రాజకీయాలను సైతం శాసించే స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో బిజీబిజీగా గడుపుతూ..ఇండస్ట్రీకి పెద్ద గా, అదే రీతిలో మరోపక్క సినిమాలు వరుసగా ఒప్పుకుంటూ.. అభిమానులను అలరిస్తున్నారు. ఇదిలా ఉంటే చిరంజీవి కెరీర్లో భారీ ఎత్తున గ్రాఫిక్స్ కలిగిన సినిమా “అంజి”.

Anji

కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని నిర్మాత శ్యాంప్రసాద్రెడ్డి నిర్మించారు. దాదాపు ఐదు సంవత్సరాల పాటు ఈ సినిమా షూటింగ్ జరిగింది. అమ్మోరు వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా 2004 వ సంవత్సరంలో రిలీజ్ అయింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా గాని గ్రాఫిక్స్ పరంగా అప్పట్లో హాలీవుడ్ సినిమాని తలపించింది. అటువంటి ఈ సినిమాలో చిరంజీవి ఒకే షర్ట్.. దాదాపు రెండు సంవత్సరాలపాటు వేసుకున్నారట.

 

ఈ విషయాన్ని కోడి రామకృష్ణ తెలియజేశారు. సినిమా గ్రాఫిక్స్ నేపథ్యంలో తెరకెక్కిన క్రమంలో సినిమాకి సంబంధించి షూటింగ్.. డిస్క్.. అమెరికాకి పంపించడంతో అక్కడ వర్క్ జరుపుకొని తరువాత మళ్లీ అదే డిస్క్ జాకి తీసుకురావటంతో చిరంజీవి ఓకే కాస్ట్యూమ్ రెండు సంవత్సరాలపాటు వేసుకున్నట్లు.. సినిమా గ్రాఫిక్స్ పరంగా టాలీవుడ్ స్థాయి పెంచడానికి నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి చాలా డెడికేషన్ తో పని చేసినట్లు చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా అంజి సినిమా కోసం చిరంజీవి ఐదు సంవత్సరాల పాటు టైం కేటా యించడం మాత్రమే కాక ఒకే కాస్ట్యూమ్ షర్ట్ దాదాపు రెండు సంవత్సరాలు వేసుకోవటం జరిగిందని కోడి రామకృష్ణ తెలియజేశారు.


Share

Related posts

Sharmila : ముఖ్యమంత్రి అయిపోదాము అనుకున్న షర్మిల కి మొదటి షాక్ షురూ – కే‌సి‌ఆర్ వరస బులెట్ లు.

somaraju sharma

తాటే కాదు.. కలుపు కూడా తీస్తారు ! ఎవరు వారు?

Yandamuri

ఆ హీరో టార్గెట్ చిరంజీవేన‌ట‌..!

Siva Prasad