RRR Arrest: సీఎంని తిట్టినా,పీఎంను విమర్శించినా సేమ్ ట్రీట్మెంట్!ఏపీలో అయినా.. ఢిల్లీలో అయినా అరెస్టులే!

Share

RRR Arrest: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కి వ్యతిరేకంగా మాట్లాడుతున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్టు వ్యవహారం రాజకీయ ప్రకంపనలు రేపుతుండగా…ఈ మాదిరే ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా పోస్టర్లతో ప్రచారం చేస్తున్న 12మందిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనావైరస్ మహమ్మారి నియంత్రణను హ్యాండిల్ చేస్తున్న ప్రధాని మోడీపై వీరు దుష్ప్రచారం చేయడాన్ని పోలీసులు గుర్తించారు.వారిపై 13 ఎఫ్ఐఆర్లు ఫైల్ చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు. ఢిల్లీలోని నాలుగు డివిజన్లలో వ్యక్తులను గుర్తించి అరెస్టు చేశారు.

Same treatment for insulting the CM or criticizing the PM! Arrests in AP or Delhi!
Same treatment for insulting the CM or criticizing the PM! Arrests in AP or Delhi!

అసలేం జరిగిందంటే !

గత కొంతకాలంగా ప్రధాని ని తీవ్రంగా విమర్శిస్తూ ఢిల్లీలో వాల్ పోస్టర్లు వెలుస్తున్నాయి.నిజానికి కరోనావైరస్ మహమ్మారి ప్రభావంతో నష్టపోయిన ప్రాంతాల్లో ఢిల్లీ ఒకటి. మెడికల్ ఆక్సిజన్ కొరతతో చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేల మంది మరణం తర్వాత రీసెంట్ గా ఇన్ఫెక్షన్ రేటు తగ్గడం, కాస్త పాజిటివ్ అంశంగా కనిపిస్తుంది. గడిచిన మూడు వారాల్లో 3లక్షల ఇన్ఫెక్షన్లు నమోదైనట్లు రికార్డులు చెబుతున్నాయి. చాలా మంది హాస్పిటల్ బెడ్స్ దొరకకుండానే చనిపోతున్నారు. సంక్షోభాన్ని సరిగ్గా ఎదుర్కోలేకపోతున్నారంటూ మోడీ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఈ నేపథ్యంలోనే ఆయనపై తీవ్ర స్థాయిలో వ్యతిరేక ప్రచారం సాగుతోంది.ఇది కూడా వాల్ పోస్టర్ల రూపంలో జరుగుతుండడం విశేషం. ‘మోడీ జీ, ఆప్నే హమారే బచ్చోన్ కీ వ్యాక్సిన్ విదేశ్ క్యో భేజ్ దియా?’ (మోడీ గారూ.. మా పిల్లల వ్యాక్సిన్ ను మీరు విదేశాలకు ఎందుకు పంపించేశారు). అంటూ పోస్టర్లు దర్శనమిచ్చాయి.దీన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది.ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించగా పోలీసులు తూర్పు ఢిల్లీలోని కళ్యాన్ పురి ఏరియాలో గురువారం ఆరుగురిని అరెస్టు చేశారు. ప్రధాని మోడీని విమర్శిస్తూ ఉండగా వారిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 800 పోస్టర్లను, బ్యానర్లను రికవర్ చేసినట్లుగా తెలిపారు.అంతేగాక వీరి వెనక ఎవరున్నారు, ఇదేమన్నా రాజకీయ కుట్ర అన్న కోణంలో కూడా దర్యాప్తు సాగిస్తున్నట్లు ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.


Share

Related posts

ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలకు ప్రివిలేజ్ కమిటీ నోటీసులు..! ఎందుకంటే..?

somaraju sharma

Bomma Adhirindi: హీరో రాజశేఖర్ ను ఇమిటేట్ చేసిన సద్దాం.. నాపేరు రాణిశేఖర్ అంటూ రచ్చరచ్చ?

Varun G

బాబు జైలు కి అంటున్న వైసీపీ మంత్రి..!!

sekhar