ప్రారంభమైన మేడారం మహా జాతర

Share

హైదరాబాద్ : మేడారం మహాజాతర బుధవారం అత్యంత వైభవంగా  ప్రారంభమైంది. మేడారానికి భక్తులు లక్షలాదిగా తరలి వస్తుండటంతో జనసంద్ర మైంది. నేడు పగిడిద్దరాజు గద్దెల వద్దకు చేరుకోనున్నారు. ఆనవాయితీ ప్రకారం పెనుక వంశస్తులు మహబూబాబాద్ జిల్లా పోనుగొండ్ల నుంచి.. సమ్మక్క భర్త పగిడిద్దరాజును తీసుకురానున్నారు. పడిగిద్దరాజును తీసుకు వచ్చేందుకుు కాలినడకన 66 కి.మీ.అటవీ మార్గంలో ప్రయాణం చేయాల్సి ఉంది. పెనుక వంశస్తులు కుంకుమ భరణి రూపంలో ఉన్న అమ్మవారిని సైతం తీసుకురానున్నారు. లక్షలాదిగా తరలి వస్తున్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో అన్ని శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి ఆదేశాలు జారీ చేసారు.


Share

Related posts

ముగిసిన అపెక్స్ కౌన్సిల్ భేటీ..!

Special Bureau

బ్రేకింగ్ : జగన్ కు బాలయ్య లేఖ..! ఏమి కోరారో చూడండి

arun kanna

ప‌వ‌న్‌ను గుడ్డిగా కాపీ కొట్టిన టీడీపీ?!

sridhar

Leave a Comment