Radhe shyam: ‘రాధే శ్యామ్’ సినిమా నుంచి తాజాగా సంచారి సాంగ్ రిలీజ్ అయింది. ఈ సాంగ్ చూస్తే ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఇది కదా కావాల్సింది.. సర్‌ప్రైజింగ్‌గా ఉంది. పాన్ ఇండియన్ సినిమా రాధాకృష్ణ కుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా అగ్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ బాలీవుడ్ నిర్మాణ సంస్థ టీ సిరీస్ వారితో కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మోస్ట్ వాంటెడ్ బ్యూటీ క్రేజీ హీరోయిన్ పూజా హెగ్డే ఈ సినిమాలో ప్రభాస్ సరసన నటించింది. 1970 కాలం నాటి పీరియాడిక్ రొమాంటిక్ లవ్ స్టోరిగా రాధే శ్యామ్ సినిమాను దర్శకుడు రాధాకృష్ణ కుమార్ రూపొందిస్తున్నాడు.

ఇక ఈ సినిమా ప్రభాస్ కెరీర్‌లో ఇప్పటివరకు చేయనటువంటి ఓ కొత్త ప్రయోగం అని చెప్పాలి. మాస్ అండ్ యాక్షన్ హీరోగా నటించిన ప్రభాస్ పామిస్ట్‌గా ఓ క్లాసిక్ రోల్‌లో నటించడం ఇదే మొదటిసారి. హాలీవుడ్ ఫీల్ కలిగేలా రాధే సినిమాను మంచి విజువల్ వండర్‌గా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే హిందీ వెర్షన్ నుంచి సోచ్ లియా, ఆషికి ఆగయీ సాంగ్స్ వచ్చి బాలీవుడ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ‘ఉద్ జా పరిందే’ అంటూ సాగే మరో సాంగ్ వచ్చింది. యూరప్ దేశంలో చిత్రీకరించిన ఈ సాంగ్‌లో ప్రభాస్ చాలా కొత్తగా కనిపిస్తున్నాడు.
Radhe shyam: సాంగ్ అన్నీ ‘రాధే శ్యామ్’ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పరచాయి.
ఇక ఇదే సాంగ్ తెలుగు సహా మిగతా భాషలలోనూ రిలీజ్ చేశారు. సంచారి అంటూ సాగుతున్న ఈ సాంగ్ మన తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తెలుగు వెర్షన్‌కు రాధాకృష్ణ కుమార్ సంగీతం అందించాడు. తమిళ యువ సంగీత దర్శకుడు, సింగర్ అనిరుధ్ ఈ సాంగ్‌ను పాడగా కె కె సాహిత్యం అందించాడు. ఇప్పటివరకు రిలీజైన సాంగ్స్ అన్నీ ‘రాధే శ్యామ్’ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పరచాయి. ‘ఆర్ఆర్ఆర్’, ‘భీమ్లా నాయక్’ లాంటి భారీ కమర్షియల్, మాస్ ఎంటర్‌టైనర్స్ ముందు ‘రాధే శ్యామ్’ లాంటి క్లాసిక్ ఎలాంటి సక్సెస్ సాధిస్తుందో చూడాలి.