ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

బాబాయ్ అశోక్ గురించి సంచయిత గజపతి రాజు ఎమన్నారో చూడండి…!!

Share

తెలుగుదేశం telugudesam పార్టీ వ్యవస్థాపకుడు. దివంగత మాజీ ముఖ్యమంత్రి  నందమూరి తారక రామారావు (NTR) 25వ వర్థంతి సందర్భంగా ఆ పార్టీ నేతలు, అభిమానులు ఆయనకు ఘన నివాళులర్పిస్తున్నారు. హైదరాబాద్ లో ఎన్ టి ఆర్ ఘాట్ వద్ద నందమూరి బాలకృష్ణ తదితర కుటుంబ సభ్యులు, ఏపిలో టీడీపీ TDP అధినేత చంద్రబాబు నాయుడు  తదితర నేతలు ఎన్‌టిఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

sanchaita gajapathi Raju comments on ashok gajapathi Raju

అదే విధంగా కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ట్విట్టర్ వేదికగా ఎన్‌టిఆర్ పార్టీ స్థాపించిన కొత్తలో దిగిన ఒక ఫోటోను షేర్ చేస్తూ “తెలుగు వారి కీర్తిని ఎలుగెత్తి చాటిన ఆంధ్రుల ఆరాధ్య దైవం మరియు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారి 25వ వర్థంతి సందర్భంగా ఆయనను స్మరిస్తూ, ఆయన ఆశయాలకు అనుగుణంగా మనమందరం నడుచుకోవాలని మరియు మన పార్టీ పురోభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటున్నాను” అంటూ ట్వీట్ చేశారు. దీనిపై మాన్సాస్ ట్రస్ చైర్ పర్సన్ సంచయిత గజపతిరాజు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ అశోక్ గజపతిరాజుపై మరో సారి తీవ్రంగా విమర్శించారు.

పార్టీ పెట్టుకుని సొంత కాళ్ల మీద అధికారంలోకి వచ్చిన ఎన్ టి ఆర్ ను పదవి నుండి తప్పించి ఆయన మరణానికి కారకులైన వ్యక్తుల్లో నారా చంద్రబాబు నాయుడు గారితో పాటు అశోక్ గజపతిరాజు ఒకరు అని, వీరిని పార్టీ నుండి బహిష్కరించాలని ఎన్ టీ ఆర్ ఆ రోజు స్పీకర్‌కు రాసిన లేఖను షేర్ చేస్తూ ఆనాటి కుట్రలో ఎవరు ఉన్నారో చెప్పే సాక్షం ఇదేనంటూ పేర్కొన్నారు. రాజకీయ సూత్రాలను, నైతిక విలువలను, ప్రజలిచ్చిన తీర్పును మంటగలిపిన అశోక్ గజపతిరాజు గారు ఎన్ టి ఆర్ ఆరాధ్యదైవం అంటూ ఆయన వర్థంతి రోజున కొనియాడటం ఒక వ్యక్తిని హత్య చేసిన హంతకుడు అదే వ్యక్తి దురమయ్యాడంటూ కన్నీరు కార్చినట్లుగా ఉంది అని సంచయిత విమర్శించారు.

ఇది కూడా చదవండి..యుపిలో ప్రభుత్వ ఆసుపత్రి ఉద్యోగి మృతి..కరోనా టీకా కారణం కాదంటున్న ప్రభుత్వ వర్గాలు


Share

Related posts

Crime News : ఆటోను ఢీ కొట్టిన టిప్పర్.. ఆరుగురు మృతి..

bharani jella

దూసుకెళ్తున్న మారుతి స్విఫ్ట్..!! మరో మైలురాయిని అధిగమించింది..!!

bharani jella

Child Future: ఇంట్లో ఈ ఒక్క ఫోటో పెట్టుకుంటే మీకు,మీ పిల్లల భవిష్యత్తుకి  గొప్ప రక్షని కల్పిస్తుంది !!

siddhu
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar