ట్రెండింగ్ న్యూస్

Extra Jabardasth : ఎక్స్ ట్రా జబర్దస్త్ లో సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి సందడి?

Extra Jabardasth : ఎక్స్ ట్రా జబర్దస్త్ లో సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి సందడి?
Share

Extra Jabardasth : ఎక్స్ ట్రా జబర్దస్ Extra Jabardasth షో గురించి తెలుసు కదా. తెలుగులోనే టాప్ కామెడీ షోలలో ఇది ఒకటి. జబర్దస్త్ తర్వాత అంతటి ప్రాచుర్యం పొందిన షో ఎక్స్ ట్రా జబర్దస్త్. తెలుగు బుల్లితెర మీద సూపర్ డూపర్ కామెడీ కావాలంటే ఖచ్చితంగా ఎక్స్ ట్రా జబర్దస్త షోను చూడాల్సిందే.

Sandeep Kishan and lavanya tripati in extra jabardasth
Sandeep Kishan and lavanya tripati in extra jabardasth

చాలామంది ఎక్స్ ట్రా జబర్దస్త్ ను కేవలం సుడిగాలి సుధీర్ కోసమే చూస్తుంటారు. సుడిగాలి సుధీర్ స్కిట్ అంటే అంత క్రేజ్ మరి.

అయితే.. తాజాగా ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలో ఏ1 ఎక్స్ ప్రెస్ టీమ్ సందడి చేసింది. ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా హీరో సందీప్ కిషన్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి షోకు వచ్చి సందడి చేశారు. అందరి స్కిట్లు చూసి కాసేపు నవ్వుకున్నారు.

Extra Jabardasth : ఎక్స్ ట్రా జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో వచ్చేసింది

తాజాగా ఎక్స్ ట్రా జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. ఆ ప్రోమోలో సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి కనిపించి కనువిందు చేశారు. ఇద్దరూ స్కిట్లను చూసి తెగ నవ్వేసుకున్నారు. వామ్మో.. ఇదేం కామెడీ బాబోయ్ అంటూ నవ్వలేక చచ్చిపోయారు.

ఎక్స్ ట్రా జబర్దస్త్ సెట్ కు వెళ్లి నవ్వకుండా ఉండేవాళ్లు ఎవరైనా ఉంటారా? అస్సలు ఉండరు. తాజాగా అదే జరిగింది. అయితే.. సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి సెట్ మీదికి రాగానే.. సింగిల్ సింగిల్ అనే పాటకు సందీప్ డ్యాన్స్ వేశాడు. దీంతో యాంకర్ రష్మీ.. అందమైన అమ్మాయిని పక్కన పెట్టుకొని సింగిల్ సింగిల్ అనే పాట పాడుతున్నారు ఏంటి సందీప్ కిషన్… అంటూ ఆయనపై సెటైర్లు వేసింది. మొత్తం మీద ఈసారి ఎక్స్ ట్రా జబర్దస్త్ ఫుల్ టు ఫన్ గా సాగనుంది. దానికి సంబంధించిన ప్రోమోను చూసేయండి.

 


Share

Related posts

Delhi: మందు ప్రియులకు ఢిల్లీ సర్కార్ గుడ్ న్యూస్

Srinivas Manem

Breaking : అనంతపురం జిల్లాలో నరబలి కలకలం

somaraju sharma

Diabetes: డయాబెటిస్ తగ్గడానికి ఇదొక్కటే మార్గం..!

bharani jella
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar