NewsOrbit
న్యూస్

కురిచేడు శానిటైజర్ గ్యాంగ్ దొరికేసింది!

కరోనా ను క్యాష్ చేసుకోవాలనుకున్న అతడి కక్కుర్తి 16 నిండు ప్రాణాలను బలిగొంది. కేవలం మూడో తరగతి చదివిన అతడు ఏకంగా శానిటైజర్ తయారు చేసి మార్కెట్లోకి వదలడంతో దానిని తాగి ప్రకాశం జిల్లా కురిచేడు లో 16 మంది మరణించారు.

Andhra Pradesh: 9 die after consuming sanitizer in wake of 10-day ...

అతడి అజ్ఞానం అంతమందికి యమపాశం విసిరింది. ఇంకెంతో మంది బలి అయ్యే లోపు ప్రభుత్వం మేలుకొంది ఉన్నత స్థాయి విచారణ జరిపింది. చివరకు ఆ గ్యాంగును ఆంధ్రప్రదేశ్ పోలీసులు హైదరాబాదులో సోమవారం అరెస్టు చేశారు.ఈ కేసుతో సంబంధం ఉన్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.వీరిలో శానిటైజర్ కంపెనీ ‘పర్ఫెక్ట్’ యజమాని శ్రీనివాస్, ముడిచమురు అందించిన ఇద్దరు మార్వాడీలు, మరో ఇద్దరు డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. ప్రస్తుతం వీరు కురిచేడు పోలీసుల అదుపులో ఉన్నారు.

పోలీసు విచారణలో ఈ కేసుకు సంబంధించిన అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. . పోలీస్ వర్గాల సమాచారం ప్రకారం శానిటైజర్ కంపెనీ యజమాని శ్రీనివాస్ కేవలం మూడో తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు. తొలుత ఒక కిరాణా షాపులో పని చేశాడు.ఆ తర్వాత పర్ఫెక్ట్ కిరాణా మర్చెంట్స్ పేరుతో ఒక దుకాణాన్ని నిర్వహించాడు. లాక్ డౌన్ సమయంలో శానిటైజర్లు, మాస్కులను విక్రయించాడు.

వ్యాపారం బాగుండటంతో… సొంతంగా శానిటైజర్ల తయారీని ప్రారంభించాడు. దీనికి ప్రభుత్వ పరంగా ఎలాంటి అనుమతులుకు కూడా లేవు.పర్ఫెక్ట్ శానిటైజర్ పేరుతో తయారీని మొదలెట్టాడు.అయితే, శానిటైజర్ తయారీలో వాడాల్సిన ఇథైల్ ఆల్కహాల్ బదులు మిథైల్ క్లోరైడ్ ను వాడటం అతను చేసిన పెద్ద తప్పు.జనాలు ప్రాణాలు కోల్పోవడానికి ఇదే కారణమనని పోలీసులు నిర్ధారించారు.అయితే గుడ్డిలో మెల్ల అన్నట్లు ఈ శానిటైజర్ ను అతను కేవలం కురిచేడు ప్రాంతంలోనే అమ్మాడు.ఒక డిస్ట్రిబ్యూటర్ మెడికల్ షాపులకు ఈ శానిటైజర్లు పంపిణీ చేసినట్టు విచారణలో తెలిసింది. ప్రస్తుతం అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. తీగలాగితే డొంక కదిలింది ఇంకా ఎన్ని విషయాలు బయటకు వస్తాయో చూడాలి

author avatar
Yandamuri

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju