Deepthi Sunaina : దీప్తి సునయన Deepthi Sunaina గురించి తెలుసు కదా. తనేంటో.. తను ఎలా సోషల్ మీడియా స్టార్ అయిందో అందరికీ తెలుసు. తన అందం, అభినయంతో కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టేలా చేస్తుంది ఈ సుందరి. దీప్తి సునయన అంటేనే సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. తన రేంజే వేరు. ప్రస్తుతం తనకు సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ ఉన్నారు. తను సోషల్ మీడియాలో ఏం చేసినా అది సంచలనమే.

దీప్తి సునయన ఎక్కువగా వీడియో ఆల్బమ్స్ చేస్తుంటుంది. వీడియో ఆల్బమ్స్ తర్వాత వెబ్ సిరీస్ లలోనూ నటిస్తుంది. తనకు ఎక్కువగా పేరు తెచ్చి పెట్టింది మాత్రం బిగ్ బాస్ అనే చెప్పుకోవాలి. బిగ్ బాస్ లోకి ఎప్పుడైతే దీప్తి సునయన ఎంట్రీ ఇచ్చిందో అప్పుడే తన గురించి అందరికీ తెలిసింది. ప్రస్తుతం తను కొన్ని టీవీ షోలలోనూ మెరుస్తోంది.
Deepthi Sunaina : సారంగ దరియా పాటకు అదిరిపోయే స్టెప్పులేసింది
ప్రస్తుతం సోషల్ మీడియాను సారంగ దరియా అనే పాట ఓ ఊపు ఊపుతోంది. ఎక్కడ చూసినా ఆ పాటే. ఆ పాట కవర్ సాంగ్ ను తాజాగా దీప్తి సునయన చేసింది.
నిజం చెప్పాలంటే.. సాయి పల్లవి కన్నా.. దీప్తి సునయనే అద్భుతంగా డ్యాన్స్ చేసింది. సాయి పల్లవిని మించిపోయింది. ఆ చీరకట్టు, అందం, అభినయం.. అబ్బో.. దీప్తి అదరగొట్టేసిందిపో. దానికి సంబంధించిన కవర్ సాంగ్ ను మీరు కూడా చూసేయండి.