Sarkaru vaari paata : సర్కారు వారి పాట సినిమా రికార్డుల మోత మొదలైంది. బాలీవుడ్లో అక్షయ్ కుమార్ ఎలాగో టాలీవుడ్లో సూపర్ స్టార్ మహేష్ బాబు అలా గత నాలుగేళ్ళకి పైగా వరుస హిట్స్ అందుకుంటూ మంచి ఫాంలో ఉన్నాడు. ఆయన చేసిన సినిమాలన్ని బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను అందుకుంటూ..నిర్మాతలకి భారీ లాభాలను తెచ్చిపెడుతున్నాయి. ఇదే క్రమంలో మహేష్ ప్రస్తుతం చేస్తున్న సినిమా సర్కారు వారి పాట. హాలీవుడ్లో తెరకెక్కే యూనివర్సల్ కథాంశం లాంటి బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన సరికొత్త కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది.
పరశురాం ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో సెకండ్ షెడ్యూల్ సాగుతోంది. మరో 15 రోజులకి పైగానే ఇక్కడ ఈ షెడ్యూల్ కొనసాగనుంది. మహేష్ బాబు తో పాటు ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న కీర్తి సురేష్..అలాగే కీలక పాత్రలు పోషిస్తున్న ప్రధాన తారాగణం పాల్గొంటున్న సన్నివేశాలను తాజా షెడ్యూల్ లో తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ నెల 9న మహేష్ బాబు పుట్టినరోజు. ఈ నేపథ్యంలో ఇటీవల సర్కారు వారి పాట సినిమా నుంచి ఫస్ట్ నోటీస్ వచ్చింది. ఇందులో మహేష్ లుక్ తో పాటు సినిమా రిలీజ్ డేట్ ను చిత్ర బృందం ప్రకటించింది.
Sarkaru vaari paata : ఈనెల 9న ఈ మూవీ టీజర్ రిలీజ్ చేయనున్నట్టు సమాచారం.
అయితే ఈ ఫస్ట్ నోటీస్ సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. ఈ ఫస్ట్ నోటీస్ విడుదలయిన 24 గంటల్లోనే 95.6k లైక్స్, 49.1k రీట్వీట్ లను రాబట్టడం ద్వారా తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ లైక్డ్ అండ్ రీట్వీట్స్ వచ్చిన పోస్టర్ గా సర్కారు వారి పాట ఫస్ట్ నోటీస్ నిలిచింది. అంతేకాదు ఇప్పుడు ఈ సినిమా పోస్టర్ మరో రికార్డు కూడా క్రియేట్ చేసింది. తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత వేగంగా 100కె లైక్స్ సాధించిన పోస్టర్ గా కూడా మహేష్ ‘సర్కారు వారి పాట ఫస్ట్ నోటీస్ రికార్డ్ క్రియేట్ చేయడం ఆసక్తికరంగా చెప్పుకుంటున్నారు. కాగా ఈనెల 9న ఈ మూవీ టీజర్ రిలీజ్ చేయనున్నట్టు సమాచారం.