SVP: ప్రకటించినట్టుగానే సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. రిలీజ్ అయిన పోస్టర్ లో మహేష్.. హాలీవుడ్ తరహా హీరో మాదిరిగా ఉన్నాడు. పగిలిపోయిన కారులో సీట్ లో నుండి కిందకి దిగి తున్నట్టు రిలీజ్ చేసిన ఫోటో.. సినిమా యూనిట్ రిలీజ్ చేయడంతో ఫోటో చూసి మహేష్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఫోటో చూసిన చాలా మంది నెటిజన్లు అభిమానులు కచ్చితంగా సినిమాలో మహేష్ సెటిల్మెంట్లు చేసే రీతిలో క్యారెక్టర్ ఉంటుందని అంటున్నారు.
ప్రతి గొడవ కి ఒక రేటు ఫిక్స్ చేసి .. మహేష్ పంచాయతీలు సినిమా లో చేస్తాడేమో అన్న డిస్కషన్లు జరుగుతున్నాయి. పరిస్థితి ఇలా ఉండగా రిలీజ్ అయిన పోస్టర్ లో.. సినిమా రిలీజ్ డేట్ కూడా అధికారికంగా ప్రకటించారు. జనవరి 13వ తారీకు “సర్కారు వారి పాట” సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. అంతేకాకుండా ఆగస్టు 9వ తారీకు అనగా మహేష్ బర్త్ డే నాడు ఫ్యాన్స్ కి మరింత జోష్ కలిగేలా మరో సర్ప్రైజ్ ఇస్తున్నట్లు తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ లో సినిమా యూనిట్ క్లారిటీ ఇవ్వడం జరిగింది.
దీంతో ఇప్పటినుండే మహేష్ అభిమానులు సోషల్ మీడియాలో సంబరాలు స్టార్ట్ చేశారు. దీంతో సినిమా యూనిట్ స్పీడ్ బట్టి చూస్తే ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్ చాలా శరవేగంగా జరుగుతుంది అని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఏదిఏమైనా సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత చాలా లాంగ్ గ్యాప్ అనగా రెండు సంవత్సరాల పాటు.. సినిమా రాకపోవడంతో ఎట్టి పరిస్థితుల్లో సర్కారు వారి పాట సినిమా అనుకున్న టైంకి రిలీజ్ చేయాలని మహేష్ స్ట్రాంగ్ గా డిసైడ్ అయినట్లు సమాచారం.