Sarkaru vaari paata : ‘సర్కార్ వారి పాట’.. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా యూనివర్సల్ కథాంశంతో రూపొందుతున్న తాజా చిత్రం. పరశురామ్ దర్శకత్వం వహిస్తుండగా, ఇప్పటికే దుబాయ్ – హైదరాబాద్ లలో చిత్రీకరణ జరిపారు. రెండు షెడ్యూల్స్ పూర్తి చేసిన చిత్ర బృందం మూడవ షెడ్యూల్ గోవాలో ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో అతి త్వరలో గోవా షెడ్యూల్ ప్రారంభవనుండగా మహేష్ బాబు తో పాటు హీరోయిన్ గా నటిస్తున్న కీర్తి సురేష్ పాల్గొనబోతున్నారు. ఇక ఈ షెడ్యూల్ తర్వాత అమెరికాలో ఈ
సినిమాని చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది.
కాగా దుబాయ్ లో చేసిన ఫస్ట్ షెడ్యూల్ లో భారీ యాక్షన్ సీక్వెన్స్ పూర్తి చేశారు. ఇది ‘సర్కార్ వారి పాట’కి హైలైట్ గా నిలవనుందట. ‘సర్కార్ వారి పాట’ను 2022 సంక్రాంతి పండుగ సందర్భంగా బరిలో దింపబోతున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ – రానా ఏకే రీమేక్, ప్రభాస్ రాధే శ్యాం, వెంకటేశ్ – వరుణ్ తేజ్ ల ఎఫ్ 3, సినిమాలతో మహేష్ ‘సర్కార్ వారి పాట’ పోటీ పడబోతోంది. దీంతో సినిమా ఎలా ఉంటుందో అని అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో ఇండస్ట్రీ వర్గాలలో విపరీతమైన క్యూరియాసిటీ పెరిగిపోయింది.
దానికి తగ్గట్టుగానే మేకర్స్ అంచనాలు పెంచే ప్రయత్నమూ చేస్తున్నారు.
Sarkaru vaari paata : మహేష్ మాస్ లుక్ – మాసీ అప్పియరెన్స్ ప్రతీ ఒక్కరినీ సర్ ప్రైజ్ చేయనుందట
ఇందులో భాగంగా ఆగస్ట్ 9న మహేష్ బర్త్ డే సందర్భంగా టీజర్ రిలీజ్ చేయబోతున్నారు. అయితే తాజాగా ఈ టీజర్ ఎలా ఉండబోతుందనే విషయంలో కొన్ని లీకులు అందాయి. ‘సర్కార్ వారి పాట’ టీజర్ దాదాపు 1 నిముషం పాటు ఉండనుందని సమాచారం. ఇక ఓ సెటైరికల్ డైలాగ్ తో మహేష్ ఎంట్రీ అద్భుతంగా ఉండబోతుందని తెలుస్తోంది. అంతేకాదు పొడవాటి హెయిర్ కట్, లైట్ గడ్డంతో మహేష్ మాస్ లుక్ – మాసీ అప్పియరెన్స్ ప్రతీ ఒక్కరినీ సర్ ప్రైజ్ చేయనుందని విశ్వసనీయ వర్గాల ద్వారా
అందిన సమాచారం. ముఖ్యంగా థమన్ టీజర్ కి ఇచ్చిన బీజీఎం ‘సర్కార్ వారి పాట’పై అంచనాలు అమాంతం పెంచేస్తాయని తెలుస్తోంది. మరి ఆ టీజర్ ఎలా ఉంటుందో తెలియాలంటే ఆగస్ట్ 9వరకు ఆగాల్సిందే.