SVP: సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా సర్కారు వారి పాట సినిమా టీజర్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. దాదాపు నిమిషం పైగా నిడివి కలిగిన ఈ టీజర్.. సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది. సంవత్సరన్నర పైగానే మహేష్ సినిమాకి సంబంధించి ఎటువంటి అప్డేట్ చాలాకాలం రాకపోవడంతో ఒక్కసారిగా టీజర్ రిలీజ్.. చేయడంతో పాటు టీజర్ లో మహేష్ బాబు.. డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో డైలాగ్ డెలివరీ చేయటంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. మరోసారి మహేష్ తనలో ఉన్న వైవిధ్యాన్ని చూపించాడని అంటున్నారు.
ఆగస్టు 9వ తారీకు ఉదయం రిలీజ్ అయిన ఈ టీజర్ 24 గంటల్లో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువ మంది చూసిన టీజర్ గా రికార్డ్ క్రియేట్ చేయడం జరిగింది. 25.7 మిలియన్ వ్యూస్ తో పాటు 754 k లైకులు సాధించడం జరిగింది. మొత్తం మీద.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు రిలీజ్ అయిన చేజర్ల లో అత్యధికంగా 24 గంటల్లో ఎక్కువ మంది చూసిన టీజర్.. “సర్కారు వారి పాట” సినిమా రికార్డ్ క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో.. మహేష్ బాబు తన సత్తా చాటుతూ ఉన్నాడు.
టీజర్ లో మహేష్ బాబు చాలా కొత్తగా ఉండటంతో పాటు హాలీవుడ్ తరహా హీరోగా కనిపించటంతో వయసు కూడా అంతకు ముందు సినిమాల కంటే మరింత తగ్గిపోయినట్లు లుక్ ఉండటంతో.. “సర్కారు వారి పాట” సినిమా టీజర్ సోషల్ మీడియాలో.. దూసుకుపోతుంది. లాంగ్ హెయిర్ తో పాటు.. మహేష్ చెప్పిన డైలాగ్.. అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఏది ఏమైనా చాలా కాలం తర్వాత మహేష్ టీజర్ రావటంతో.. మహేష్ ఫ్యాన్స్ మరోసారి సోషల్ మీడియాలో తమ సత్తా ఏంటో నిరూపించారు.