NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Gram Panchayat sarpanches: ఇప్పుడు తెలంగాణలో స్టార్ట్ అయ్యింది .. రేపు ఏపికీ పాకుతుందా..?

Gram Panchayat sarpanches: గ్రామాల్లో సర్పంచ్ లు రాజకీయాలకు అతీతంగా ఎన్నిక అవుతున్నా ఏదో ఒక రాజకీయ పార్టీకి అనుబంధంగా అంటూ ఉంటారు. గ్రామాల్లో తమ ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు, తమ హయాంలో ఈ పనులు చేశాము అని చెప్పుకునేందుకు తహతహలాడుతుంటారు. గ్రామాల్లో ఎన్నికలను ఆయా నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంటారు. అయితే ఎన్నో ఆశలతో సర్పంచ్ లు గా గెలిచిన వారు పంచాయతీల్లో నిధుల లేమి కారణంగా ఏమి చేయలేక ఉత్సవిగ్రహాలుగా మిగిలిపోతున్నామన్న భావన వారిలో కలుగుతోంది. ఏపిలో పంచాయతీల ఆర్ధిక సంఘం నిధులను ప్రభుత్వం విద్యుత్ బకాయిలకు వాడేయడం తెలిసిందే.

Sarpanches Protest Telangana

 

గ్రామ పంచాయతీల ఆమోదం లేకుండా నిదులను లాగేసుకోవడంపై మెజార్టీ సర్పంచ్ లు ఆందోళన కూడా చేశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి సొంత జిల్లా కడప కేంద్రంలో రోడ్డెక్కి నిరసన ప్రదర్శనలు కూడా చేశారు. ఈ నిరసన కార్యక్రమాల్లో అధికార వైసీపీకి చెందిన సర్పంచ్ లే అధిక శాతం మంది ఉండటం గమనార్హం. ఏపిలో ఇంత వరకూ రాజీనామాలకు సిద్దం కాలేదు గానీ తెలంగాణలో అధికార బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చేలా సర్పంచ్ లు నిర్ణయాలు తీసుకుంటున్నారు. కుమురం భీం జిల్లాలోని వాంకిడి మండలానికి చెెందిన 18 మంది ఆదివాసీ సర్పంచ్ లు కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందన్న ఆశతో 2019 లో పార్టీలో చేరామనీ, కానీ ఇప్పటి వరకూ ఎలాంటి అభివృద్ధి జరగలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ తాము రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

Sarpanches Protest Andhra Pradesh

 

తాము గెలిచి అధికారం చేపట్టిన తొలి రోజుల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి ఇప్పటికీ బిల్లులు రాలేదని, దీంతో ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. అయితే సర్పంచ్ ల రాజీనామాపై బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, సిర్పూర్ ఎమ్మెల్యే అత్రం సక్కు స్పందించారు. తాను సర్పంచ్ లతో చర్చలు జరిపి వారికి నచ్చజెబుతానని, సమస్యల పరిష్కారం కోసం సమిష్టిగా కృషి చేస్తామని ఆయన తెలిపారు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలో సర్పంచ్ లు నిన్న మండల పరిషత్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. 15వ ఆర్ధిక సంఘం నిధులు తమకు తెలియకుండా అధికారులు డ్రా చేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడి సర్పంచ్ లు ఎదుర్కొంటున్న పరిస్థితి తెలంగాణలోని ఇతర జిల్లాలతో పాటు ఏపిలోనూ నెలకొని ఉంది. ఏపిలో కూడా సర్పంచ్ ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకుంటే రాబోయే రోజుల్లో వీరు అదే బాట పట్టే అవకాశం ఉందని అంటున్నారు.

చంద్రబాబు కనీసం రెండు సీట్లయినా వచ్చేలా శ్రమపడితే మంచిదని సలహా ఇచ్చిన విజయసాయి రెడ్డి

author avatar
sharma somaraju Content Editor

Related posts

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N