Sasikala : తమిళనాట ఎన్నికల వేళ చిన్నమ్మ శశికళ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. రాజకీయాలు, ప్రజా జీవితానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. తనకు పదవులపై, అధికారం మీద ఆసక్తిలేదని స్పష్టం చేసిన శశికళ..అమ్మ జయలలిత అభిమానులు అందరూ ఏకమై డీఎంకెను ఓడించాలని పిలుపునిచ్చారు.
తమిళనాట ఎన్నికలకు ముందు శశికళ జైలు నుండి విడుదల అయి రావడంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పాత్ర కీలకంగా ఉంటుందని పెద్ద ఎత్తున ఊహాగానాలు వచ్చాయి. ఆ ఊహాగానాలకు బలం చేకూరేలా శశికళ బెంగళూరు నుండి భారీ కాన్వాయ్‌తో ఊరేగింపుగా చెన్నైకి చేరుకున్నారు. అన్నా డీఎంకే నుండి పెద్ద ఎత్తున నేతలు ఆమె పక్షాన చేరతారని ఊహగానాలు వచ్చాయి. అయితే ఈ ఊహలన్నింటికి భిన్నంగా శశికళ నేడు సంచలన నిర్ణయాన్ని వెల్లడించారు. తమిళనాట అమ్మ ప్రభుత్వం ఏఐడీఎంకే మళ్లీ రావాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.