Sathyadev : టాలెంటెడ్ డైరెక్టర్ సత్యదేవ్ ఇప్పుడు సౌత్ లో బిజీ హీరో. ఆయన చేతిలో సినిమాలు, వెబ్ సిరీస్ లు ఉన్నాయి. కథ నచ్చితే దేనిని ఆయన వదలడం లేదు. స్టార్ హీరోలైనా ఆచి తూచి కమిటవుతారేమో గానీ సత్యదేవ్ మాత్రం తనకి ప్లస్ అవుతుందనుకుంటే మాత్రం సైన్ చేసేస్తున్నాడు. సత్య దేవ్ కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రల్లో నటించాడు. జ్యోతిలక్ష్మీ తో బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత కొన్ని చిన్న పాత్రలు చేసినా కూడా ఘాజీ లాంటి సినిమాతో ఇండస్ట్రీలో అందరి చూపు
ఆయన మీదే పడింది. అయితే మరోసారి దర్శకత్వంలో నటించే అవకాశం అందుకున్న సత్య దేవ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ అందుకున్నాడు.
ఈ సినిమా తర్వాత టాలీవుడ్ లో ఆయన రేంజ్ మొత్తం మారిపోయింది. ఎంతగా అంటే కొందరు దర్శకులు ఇప్పుడు సత్యదేవ్ ని దృష్టిలో పెట్టుకొనే కథలు రాస్తున్నారు. అలాగే తమిళ స్టార్ హీరోలకు తెలుగు డబ్బింగ్ చెప్పడం బాగా కలిసి వచ్చింది. తమిళ సినిమాలు తెలుగులో డబ్బింగ్ చేస్తుంటే హీరోలకి సత్య దేవ్ తన గొంతు అరువిస్తున్నాడు. కేవలం సినిమాలు మాత్రమే కాకుండా ఓటీటీ లో కూడా తన సత్తా చాటుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా సత్యదేవ్ హీరోగా రూపొందిన ‘లాక్డ్’ వెబ్ సిరీస్ కు సీక్వెల్ తయారవుతోంది. తాజాగా దీనికి సంబంధించిన అప్డేట్ ని కూడా మేకర్స్ ఇచ్చారు.
Sathyadev : ‘రామ్ సేతు’లోముఖ్య పాత్ర చేసే అవకాశం దక్కించుకున్నాడు.
కాగా ప్రదీప్ దేవకుమార్ దర్శకత్వంలో రూపొందించిన ఇందులో సత్యదేవ్ తో పాటు సంయుక్త, శ్రీలక్ష్మి ప్రధాన పాత్రలు పోషించారు. న్యూరో స్పెషలిస్ట్ చుట్టూ కథ తిరుగుతూ ఎంతో ఉత్కంఠ భరితంగా తెరకెక్కిన ‘లాక్డ్’ వెబ్ సిరీస్ కి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కించుకుంది. ఇప్పటి వరకు తెలుగులో వచ్చిన వాటిలో ది బెస్ట్ వెబ్ సిరీస్ ఇది. దీనికి సీక్వెల్ గా ‘లాక్డ్ 2’ రాబోతున్నట్లు తాజాగా ప్రముఖ తెలుగు ఓటీటీ ‘ఆహా’ అధికారికంగా ప్రకటించింది. ఇక సత్యదేవ్ హీరోగా తెరకెక్కిన ‘తిమ్మరుసు’ చిత్రం జూలై 30న
థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. గోపిగణేశ్ పట్టాభి దర్శకత్వంలో రూపొందుస్తున్న ‘గాడ్సే’, అలాగే తమన్నాతో కలసి చేస్తున్న ‘గుర్తుందా శీతాకాలం’సినిమాలున్నాయి. అంతేకాదు ‘భగవద్గీత సాక్షిగా’ అనే కొత్త సినిమాతో పాటు బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నటిస్తున్న ‘రామ్ సేతు’లోముఖ్య పాత్ర చేసే అవకాశం దక్కించుకున్నాడు.