Sathyadev : సత్యదేవ్ ఇప్పుడు నిర్మాతల హీరోగా మారాడు. జ్యీతిలక్ష్మి సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న సత్యదేవ్ ఆ తర్వాత ఘాజీలో మంచి పాత్ర పోషించి అందరి మన్నలను పొందాడు. ఇక పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రాం హీరోగా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సెకండ్ హీరో రేంజ్ క్రేజ్ వచ్చింది. ఆ క్రేజ్‌తో ఏకంగా సత్యదేవ్ హీరోగా సినిమాలు చేసే స్థాయికి చేరుకున్నాడు. ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య హీరోగా మంచి పాపులారిటీ తెచ్చింది. అలాగే తన చేతినిండా సినిమాలున్నాయి.
వాటిలో బాలీవుడ్ లేటెస్ట్ సినిమా హబీబ్. హిందీలో సత్యదేవ్ చేస్తున్న సోలో సినిమా. జెన్నిఫర్ అల్ఫోన్స్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. హబీబ్ సఫీ -కోటి రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హబీబ్ సినిమా నుంచి ఓ అద్భుతమైన పాటను చిత్ర బృందం రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. సత్యదేవ్ ఈ సినిమాతో ఖచ్చితంగా అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్లో విపరీతమైన క్రేజ్ దక్కడం ఖాయమని చెప్పుకుంటున్నారు.
Sathyadev : సత్యదేవ్ తెలుగులో తమన్నాతో కలిసి గుర్తుందా శీతాకాలం అనే సినిమా చేస్తున్నాడు.
కాగా తప్పిపోయిన తన ఏకైక కుమారుడిని వెతుకుతూ భారతీయ ఆర్మీ అధికారులతో కలిసి ఒక తండ్రి సెర్చ్ నేపథ్యంలో హబీబ్ కథ సాగుతుంది. వాస్తవ సంఘటన ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇక తాజాగా విడుదల చేసిన సాంగ్ హార్ట్ టచింగ్ గా ఉండి ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటోంది. ఆఫ్ఘన్ సైన్యంతో పాటు మరి కొంతమంది పౌరుల మద్దతుతో కొడుకుని కనిపెట్టి, మిగిలిన పిల్లలందరితో పాటు అతన్ని తిరిగి తీసుకువచ్చి వారి జీవితాలకు స్వేచ్ఛను ఇచ్చే పాత్రగా హబీబ్ సినిమా తయారవుతోంది. ఇక సత్యదేవ్ తెలుగులో తమన్నాతో కలిసి గుర్తుందా శీతాకాలం అనే సినిమా చేస్తున్నాడు.