Sathyadev : సత్యదేవ్ స్టామినా..టాలీవుడ్‌లో వర్సటైల్ హీరోగా క్రేజ్

Share

Sathyadev : సినిమా ఇండస్ట్రీలో ఎవరి అండదండలు లేకుండా ఎదగడం స్టార్ స్టేటస్ సాధించుకోవడం అంటే చాలా కష్టం. కానీ టన్నులకొద్దీ టాలెంట్ ఉంటే మాత్రం స్టార్ హీరోలకి గట్టిపోటీ ఇవ్వొచ్చు. పోటీ ఇవ్వకపోయినా తమకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ సాధించుకొని కొన్ని ప్రత్యేకమైన కథలు వారికోసమే తయారయ్యేలా తమని తాము మలచుకుంటారు. అలాంటి హీరో సత్యదేవ్. ఓ క్యారక్టర్ ఆర్టిస్టుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి ‘జ్యోతిలక్ష్మి’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నాడు.

sathyadev-stamina-made-him-a-versatile-hero-in-tollywood-industry
sathyadev-stamina-made-him-a-versatile-hero-in-tollywood-industry

ఆ తర్వాత రానా నటించిన ‘ఘాజీ’ వరుణ్ తేజ్ నటించిన ‘అంతరిక్షం’ సినిమాలలో మంచి పాత్రలు చేశాడు. ఇక రాం పోతినేని – పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలో సెకండ్ లీడ్ రోల్‌లో అదరగొట్టాడు. ఇదే క్రమంలో ‘బ్లఫ్ మాస్టర్’, ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమాలతో హీరోగా క్రేజ్ తెచ్చుకొని ఇండస్ట్రీలో పలువురి ప్రశంసలు అందుకున్నాడు. అలాగే డిజిటల్ వరల్డ్ లో అడుగుపెట్టిన సత్య, తమిళ హీరోలకు తెలుగు డబ్బింగ్ చెప్పడంలోనూ బాగా పేరు తెచ్చుకున్నాడు. ఎంతో విభిన్నమైన కథలు, విలక్షణమైన పాత్రలు ఎన్నుకుంటూ ప్రస్తుతం నాలుగు క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు.

Sathyadev : బాలీవుడ్‌లో రాం సేతు అనే సినిమా కూడా చేస్తున్నాడు.

శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో సత్యదేవ్ ‘తిమ్మరుసు’ అనే సినిమా చేస్తున్నాడు. ‘అసైన్మెంట్ వాలి’ అనే ట్యాగ్ లైన్ తో రూపొందుతున్న ఈ సినిమాలో లాయర్ గా సత్యదేవ్ నటిస్తున్నాడు. ఇందులో ‘టాక్సీవాలా’ ఫేమ్ ప్రియాంక జవాల్కర్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే గోపిగణేశ్ పట్టాభి తెరకెక్కిస్తున్న ‘గాడ్సే” అనే సినిమాలో నటిస్తున్నాడు సత్యదేవ్. ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజై ఆకట్టుకుంది. సీకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సి. కల్యాణ్ నిర్మిస్తున్నారు. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌గా తెలుగులో అడుగుపెడుతోంది. ఇదే క్రమంలో తమన్నా భాటియా తో సత్యదేవ్ నటిస్తున్న మరో సినిమా ‘గుర్తుందా శీతాకాలం’. బాలీవుడ్‌లో రాం సేతు అనే సినిమా కూడా చేస్తున్నాడు.


Share

Related posts

ప్రతిపక్షాలకు అందనంత ఎత్తులో జగన్ ! ఎలాగంటారా?

Yandamuri

హైద‌రాబాద్‌లో ప్ర‌భాస్ 20

Siva Prasad

ఓటు వేసిన సినీ తార‌లు

Siva Prasad