Satya Dev: సొంత టాలెంట్ ఉంటే ఎవరూ తొక్కలేరనడానికి సత్య దేవ్ బెస్ట్ ఎగ్జాంపుల్.

Share

Satya Dev: సినిమా ఇండస్ట్రీలో సొంతగా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి హీరోగానో దర్శకుడిగానో నిలదొక్కుకోవాలంటే చాలా కష్టం. అదే ఇండస్ట్రీలో అప్పటికే పాతుకుపోయిన వారుంటే మాత్రం నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ సాధించడానికి ఒక దశవరకు అవకాశం ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో మంచిపోటి ఉంటుంది. దాదాపు ఇండస్ట్రీలో ఉన్నవారంతా అగ్ర హీరోల నట వారసులే. ఒక్క మెగా ఫ్యామిలీ నుంచే దాదాపు 10 మంది హీరోలున్నారు. నాగార్జున తర్వాత ఆ ఫ్యామిలీ నుంచి అరడజను మంది హీరోలు వచ్చారు.

Satya Dev is the best example that no one can beat if they have their own talent
Satya Dev is the best example that no one can beat if they have their own talent

సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి ఆయన తనయులు వచ్చినా వారిలో సూపర్ స్టార్ మహేష్ స్టార్ డం సంపాదించుకున్నాడు. నరేశ్ ఒక దశ తర్వాత అద్భుతమైన క్యారెక్టర్స్ చేస్తూ కొనసాగుతున్నారు. ఇప్పుడు సుధీర్ బాబు మంచి ఫాంలో ఉన్నారు. మల్టీస్టారర్ మూవీస్ తో పాటు మంచి కమర్షియల్ సినిమాలు అలాగే ప్రయోగాత్మకమైన సినిమాలు చేస్తూ స్టార్ డం తెచ్చుకుంటున్నారు. గల్ల అశోక్ త్వరలో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. హీరో అనే సినిమాతో రాబోతున్నాడు.

Satya Dev: మధ్యలో కొంతమంది వచ్చి సక్సెస్ సాధించలేక వెళ్ళిపోతున్నారు.

దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి వెంకటేశ్ తర్వాత రానా వచ్చి రాణిస్తున్నాడు. త్వరలో ఆయన తమ్ముడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. మంచు ఫ్యామిలీ నుంచి మోహన్ బాబు తనయులు మంచు విష్ణు, మనోజ్ అలాగే లక్ష్మీ నటనలో కొనసాగడమే కాకుండా నిర్మాతలుగానూ రాణిస్తున్నారు. అలాగే నందమూరి ఫ్యామిలీ నుంచి తారక్, కళ్యాణ్ రాం హీరోగా రాణిస్తూ సినిమా నిర్మాణ రంగంలోనూ ఉన్నారు. ఇలా దాదాపు ఇండస్ట్రీ మొత్తం నట వారసులతోనే సగానికి పైగా నిండిపోయింది. మధ్యలో ఇప్పుడిప్పుడు రాజశేఖర్ – జీవిత కుమార్తెలు లాంటి వారు ఎంట్రీ ఇస్తున్నారు. మధ్యలో కొంతమంది వచ్చి సక్సెస్ సాధించలేక వెళ్ళిపోతున్నారు.

ఇలాంటి వారి మధ్యలో ఇండస్ట్రీకి పరిచయం లేని వారు వచ్చి హీరోలుగా రాణించాలంటే కత్తి మీద సాము చేసినట్టే. ఇప్పుడు మాస్ మహారాజాగా వెలుగుతున్న రవితేజ, నేచురల్ స్టార్‌గా వెలుగుతున్న నాని, రాజ్ తరుణ్ లాంటి వారు ముందు దర్శకత్వ విభాగంలో కొన్నాళ్ళు పనిచేసి అలా హీరోగా అవకాశాలు అందుకొని స్టార్ అయ్యారు. కానీ అసలు ఎలాంటి ప్లాట్ ఫాం లేకుండా రావాలంటే కష్టం. ఇలా వచ్చి తనని తాను నిరూపించుకున్నాడు సత్య దేవ్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన జ్యోతిలక్ష్మీ సినిమాతో పేరు తెచ్చుకున్నాడు సత్యదేవ్.

Satya Dev: హిందీలో కూడా ఈ టాలెంటెడ్ హీరో ఒక సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా తర్వాత ‘బ్రోచేవారెవరురా’, మరోసారీ పూరి దర్శకత్వంలో వచ్చీ ‘ఇస్మార్ట్ శంకర్’ ‘బ్లఫ్‌ మాస్టర్‌’, అలాగే ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ వంటి డిఫరెంట్ జోనర్ సినిమాలను ఎంచుకుంటూ బాగా పాపులారిటీ సాధించాడు. ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమాలో అవకాశం అందుకున్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న తిమ్మరుసు ఇప్పటికే ప్రచార చిత్రాలతో ఆకట్టుకుంది. సినిమా మీద మంచి అంచనాలు కూడా ఉన్నా. ఇక హిందీలో కూడా ఈ టాలెంటెడ్ హీరో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ క్రమంలోనే సత్య దేవ్ హీరోగా మరో చిత్రం ప్రారంభం అయింది. డైరెక్టర్ కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ పతాకంపై కృష్ణ నిర్మిస్తున్నారు. గోపాల కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.

 


Share

Related posts

స‌రికొత్త మేకోవ‌ర్‌తో చ‌ర‌ణ్‌

Siva Prasad

బిగ్ బాస్ 4: అరియనా కోసం కష్టపడుతున్న ఎలిమినేట్ కంటెస్టెంట్..!!

sekhar

బాలు సింప్లి సిటికి ఇదే సాక్షం..!

Special Bureau