అమెరికాలో సౌదీ తొలి మహిళ రాయబారి

సౌదీ అరేబియా మొట్ట మొదటి సారిగా ఒక మహిళను రాయబరిగా నియమించింది.

ఆ దేశ యువరాణి రీమా బింట్ బందర్ బిన్ సుల్తాన్ అమెరికాలోని వాషింగ్టన్ కు సౌదీ రాయబారిగా నియమితురాలయ్యారు.

రీమా, ప్రిన్స్ బండార్ బిన్ సుల్తాన్ కుమార్తె. ఈయన అమెరికాలో సౌదీ తరుపున రాయబారిగా వ్యవహరించారు.

రీమా అమెరికాలో పెరిగారు. రీమా వాషింగ్టన్ విశ్వవిద్యాలయం పట్టభద్రురాలు.

రీమా సౌదీ స్పోర్ట్స్ అథారిటీ సభ్యురాలుగా కొనాగుతున్నారు. అంతర్జాతీయ ఒలంపిక్ కమిటీలో కూడా సభ్యురాలు.