NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్

సౌదీ యువతి… క్షేమంగా కెనడాలో!

Share

అణచివేతకు ఎదురుతిరిగిన సౌదీ యువతి కథ చివరికి సుఖాంతం అయింది. కెనడా ఆ యువతికు ఆశ్రయం ఇచ్చింది. సౌదీ అరేబియా యువతి రహాఫ్ మొహమ్మద్ కునన్ ఇంట్లోవాళ్లు పెట్టే బాధలు భరించలేక ఆస్ట్రేలియా వెళదామనుకుని పారిపోయి ధాయిలాండ్ చేరింది. అక్కడ అధికారులు ఆమెను తిరిగి సౌదీ పంపించాలని చూశారు. కునన్ హోటల్ గదిలో దాక్కుని తన బాధ వీడియో ద్వారా బయటకు పంపడంతో ఆమె గురించి ప్రపంచం అంతా తెల్సింది.

ఐక్యరాజ్య సమితి శరణార్ధుల సంస్థ రంగంలోకి దిగి ఆమెను తిరిగి స్వదేశం పంపకుండా అడ్డుకున్నది. ఈలోపు కెనడా ఆమెకు ఆశ్రయం ఇచ్చేందుకు సంసిద్ధత తెలిపింది. కెనడా అని రాసిఉన్న టీషర్ట్ ధరించి టోరొంటో విమానాశ్రయంలో దిగిన కునన్‌కు కెనడా విదేశాంగ మంత్రి క్రిస్టియా ఫ్రీలాండ్ స్వాగతం పలికింది.

గతంలో సౌదీ జైలులో ఉన్న ఒక మహిళా ఖైదీ హక్కుల గురించి కెనడా ప్రశ్నించినందుకు సౌదీ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. అప్పటి నుంచీ అంతంత మాత్రంగా ఉన్న ఇరు దేశాల సంబంధాలు కునన్ వ్యవహారంతో మరింత దిగజారే ప్రమాదం ఉంది. దీనికి సంబంధించిన ప్రశ్నలపై సమాధానం ఇచ్చేందుకు ఫ్రీలాండ్ నిరాకరించారు. దేశంలోనైనా, పరాయి దేశంలోనైనా మహిళలు, బాలికల హక్కుల కోసం కెనడా నిలబడుతుందని ఆమె అన్నారు.

న్యూయార్క్ టైమ్స్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కునన్ తనను కుటుంబసభ్యులు ఎలా బాధలు పెట్టిందీ వివరించింది. ఇంట్లో వారికి నచ్చని విధంగా జుత్తు కత్తిరించుకున్నందుకు ఒకసారి ఆమెను ఆరు నెలల పాటు గదిలో బంధించారు. కునన్ ఒకసారి ఆత్మహత్యాయత్నం చేసింది. అప్పుడు కుటుంబ సభ్యులు కనీసం డాక్టర్‌ను పిలవడానికి కూడా ఇష్టపడక పోవడంతో దేశం విడిచి పారిపోవాలని ఆమె నిర్ణయించుకున్నది.

సౌదీ యువతి రహాఫ్ కునన్ టొరంటో విమానాశ్రయంలో దిగిన సన్నివేశం కోసం కింది వీడియో క్లిక్ చేయండి.

 


Share

Related posts

బ్రేకింగ్: తెలంగాణ గవర్నర్ ఆఫీస్ లో కరోనా కలకలం

Vihari

YS Jagan: గేరు మార్చిన జగన్..! స్పాట్ లో ఇంట్రెస్టింగ్ నిర్ణయం..!?

somaraju sharma

Intermittent Fasting: మీకు నచ్చిన ఫుడ్ తింటూ కూడా బరువు తగ్గొచ్చు ఇలా..!!

bharani jella

Leave a Comment